Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup సెమీ ఫైనలిస్టులు వీరే..! గ్రోక్ షాకింగ్ జోస్యం..!

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) గ్రూప్ స్టేజ్ ను దాటి సూపర్ 8స్టేజ్ కు చేరుకుంది. ఇవాళ జరిగే సూపర్ 8 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 మ్యాచ్ ఉంది. ఇలా సూపర్ 8 స్టేజ్ లో ఉన్న రెండు గ్రూపుల్లో టాప్ 2గా నిలిచిన నాలుగు జట్లకు సెమీస్ బెర్తులు ఖరారవుతాయి. అయితే ఇప్పటికే సెమీస్ బెర్తులపై పలు అంచనాలు వెలువడుతుండగా.. తాజాగా ఏఐ గ్రోక్ కూడా తన అంచనాలను చెప్పేసింది.

సూపర్ 8 గ్రూప్ ఏ-లో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్-బీలో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. వీటిలో సెమీస్ కు ఏయే జట్లు చేరతాయన్న దానిపై గ్రోక్ ను ఎక్స్ లో ఓ యూజర్ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన గ్రోక్.. గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు చేరే రెండు జట్లతో పాటు గ్రూప్ బీ నుంచి సెమీస్ కు అర్హత సాధించే మరో రెండు జట్లను తేల్చేసింది. అయితే ఇందులో ఓ షాకింగ్ అంచనా ఉంది.

T20 World Cup 2026 Grok s Shocking Picks for the Semi-Finalists

గ్రోక్ ప్రకారం సూపర్ 8లో గ్రూప్ ఏ నుంచి భారత్, వెస్టిండీస్ జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయట. అలాగే గ్రూప్ బీ నుంచి పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయట. ఈ లెక్కన భారత్, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ అర్హత సాధించే అవకాశం ఉందని గ్రోక్ తేల్చేసింది. అయితే ఇందులో విచిత్రంగా ఆతిథ్య శ్రీలంక పేరు లేకపోవడం, సంచలనాల జింబాబ్వే పేరు కూడా లేకపోవడం, అదే సమయంలో పాకిస్తాన్ పేరు ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇవే అంశాల్నిగ్రోక్ ను యూజర్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఎందుకు సెమీస్ చేరుతుందో గ్రోక్ ఓ విశ్లేషణ కూడా ఇచ్చింది. పాకిస్తాన్ పేస్ అటాక్, బ్యాటింగ్ ఆర్డర్ లోతు ఇందుకు కారణాలని తెలిపింది. ఆసీస్ పై తాజాగా పాకిస్తాన్ సాధించిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ ను కూడా గుర్తు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+