T20 World Cup : పాకిస్తాన్ మరో షాకింగ్.. ! మరో మ్యాచ్ బాయ్ కాట్..!
వచ్చే వారం ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026) భవిష్యత్తుపై క్రమంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఉపఖండంలో జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత్ లో ఆడాల్సిన మ్యాచ్ లు ఆడని బంగ్లాదేశ్ ను తప్పించిన ఐసీసీ.. స్కాట్లండ్ కు చోటిచ్చింది. దీని తర్వాత బంగ్లాదేశ్ కు సంఘీభావంగా పాకిస్తాన్ .. భారత్ తో లీగ్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించింది. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు ఆడుతూ కేవలం భారత్ తో లీగ్ మ్యాచ్ బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.. దీంతో ఐసీసీకి ఏమీ పాలుపోవడం లేదు.
భారత్ లో శ్రీలంక వేదికగా జరిగే లీగ్ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ బహిష్కరించడం వల్ల పాకిస్తాన్ కు కలిగే ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అలాగే లీగ్ మ్యాచ్ లో భారత్ తో ఆడరు సరే, నాకౌట్ దశలో తిరిగి భారత్ ఎదురుపడితే అప్పుడేం చేస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనికి సమాధానంగా నాకౌట్ దశలోనూ భారత్ తో మ్యాచ్ ఆడాల్సి వస్తే బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో లీగ్ తో పాటు నాకౌట్ మ్యాచ్ కూడా ఆడకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు ఎన్డీటీవీ రిపోర్ట్ లో తెలిపింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత్ తో లీగ్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించిన బోర్డు.. ఇప్పుడు నాకౌట్ దశలోనూ భారత్ ఎదురైతే మ్యాచ్ ఆడకుండా దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే ఏకంగా రూ.4500 కోట్ల నష్టం జరుగుతుందని ఇప్పటికే ఐసీసీ అంచనా వేస్తోంది. ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ కూడా జరగకపోతే ఇంతకంటే ఎక్కువ మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది. అంతే కాదు మొత్తం టీ20 వరల్డ్ కప్ గతి తప్పినట్లవుతుంది. దీంతో ఐసీసీ తెరవెనుక సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications