T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!
భారత్ తో రేపు జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ( T20 world cup)పై న్యూజీలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదో గొప్ప సవాల్ అని, అలాగే తాము ఫేవరెట్ జట్టు కాదని అందరికీ తెలుసని కివీస్ కెప్టెన్ తెలిపాడు. అయితే మంచి ఆట ఆడితే మాత్రం ట్రోఫీ గెల్చుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నాడు. ఇది మరో మ్యాచ్ అని చెప్పడం చాలా సులభం అని, అది కాదని మాత్రం అందరికీ తెలుసన్నాడు. వరుసగా విఫలమవుతున్నా భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పటికీ మంచి బౌలరన్నాడు.
భారత్ తో ఫైనల్లో తమ జట్టు మైండ్ సెట్ దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ కన్నా భిన్నంగా ఏమీ ఉండదని కివీస్ కెప్టెన్ శాంట్నర్ తేల్చేశాడు. మ్యాచ్‌కు ముందు అంతా కష్టపడతారని, మీ ఆటను పరిశీలిస్తారని, వీడియోలను విశ్లేషిస్తారని, అలా పరిస్థితులను అర్థం చేసుకుంటారని తెలిపాడు. ఆపై మీ ప్రణాళికలను సాధ్యమైనంత ఉత్తమంగా అమలు చేయడానికి మైదానంలోకి అడుగుపెడతారన్నాడు. రేపు తామూ అదే చేస్తామన్నాడు.

భారత్ ఈ మ్యాచ్ కు చాలా ఊపుగా, ఆత్మవిశ్వాసంగా వస్తుందని శాంట్నర్ అంచనా వేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మ్యాచ్ వంటి హైస్కోరింగ్ పోరులో 240 పరుగులు సమర్పించుకున్నాక ఇంతకంటే మెరుగ్గా ఆడాలని వారు భావిస్తారన్నారు. అయితే, రెండు జట్లు తమ బలాలను నమ్ముకుని ఫైనల్‌కు వెళ్తాయని, ఆ రోజు ఎక్కువసేపు తమ ప్రదర్శనను కాపాడుకునే జట్టు అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందన్నాడు.ప్రతి ఆటలోని కొన్ని చిన్న క్షణాలు ఫలితాన్ని మారుస్తాయని ఫైనల్ వేళ భారత్ కు గుర్తుచేశాడు.

దక్షిణాఫ్రికాపై గెలుపు తర్వాత మరొక పెద్ద జట్టును దెబ్బతీయగలమనే విశ్వాసం వచ్చిందన్నాడు. అలాగే ఈ ప్రపంచ కప్‌ను స్వదేశంలో గెలవాలన్న ఒత్తిడి ఆతిధ్య జట్టుకు ఉంటుందన్నాడు. మీరు ఇంట్లో గెలవాలని అనుకుంటున్నందున తాము కూల్ గా ఉండకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు. హోమ్ వరల్డ్ కప్ కాబట్టి అది కూడా చాలా అదనపు ఒత్తిడితో కూడుకున్నదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. కాబట్టి మనం అక్కడకు వెళ్లి వారిపై అదనపు ఒత్తిడిని పెట్టడానికి ప్రయత్నించగలిగితే ఫలితం ఉంటుందన్నాడు.












Click it and Unblock the Notifications