T20 World cup సెమీస్ బెర్తులు వీళ్లకే...! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..!
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) సూపర్ 8 స్టేజికు చేరింది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు ముగిశాయి. ఇందులో పాకిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఇంగ్లాండ్ శ్రీలంకను, దక్షిణాఫ్రికా భారత్ ను ఓడించాయి. ఇవాళ జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య మరో కీలక సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో సూపర్ 8 స్టేజ్ ను దాటి సెమీస్ కు చేరే జట్లపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐ ప్లాట్ ఫామ్స్ మాత్రం దాదాపుగా సెమీస్ చేరే జట్లపై ఏకాభిప్రాయానికి వచ్చేశాయి.
టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8కు చేరిన జట్లలో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజీలాండ్ ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏలో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్ బీలో పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజీలాండ్ ఉన్నాయి. వీటిలో సెమీస్ కు చేరే అవకాశం రెండు గ్రూపుల నుంచి చూసుకుంటే గ్రూప్ ఏలో భారత్, దక్షిణాఫ్రికాకూ కనిపిస్తోంది. అలాగే గ్రూప్ బీలో ఇంగ్లాండ్, న్యూజీలాండ్ కు కనిపిస్తోంది.

ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపాలైనా తమ తర్వాతి రెండు మ్యాచ్ లను వెస్టిండీస్, జింబాబ్వేపై నెగ్గి మంచి రన్ రేట్ తో సెమీస్ కు చేరే అవకాశం టీమిండియాకు ఎక్కువగా ఉంది. అలాగే పాకిస్తాన్ తో మ్యాచ్ వర్షార్పణం అయినా న్యూజీలాండ్ కూడా మరో రెండు మ్యాచ్ లను ఇంగ్లాండ్, శ్రీలంకపై నెగ్గి సెమీస్ కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీలంకపై గెలిచిన ఇంగ్లాండ్.. మరో మ్యాచ్ గెలిస్తే ఎలాగో సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది. దీంతో ఏఐ ప్లాట్ ఫామ్స్ గ్రోక్, ఛాట్ జీపీటీ, జెమినీ ఏఐ, పర్ ప్లెక్సిటీ భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ కే సెమీస్ చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications