IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..!
టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) సెమీస్ దశకు చేరుకుంది. ఇవాళ జరిగే తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. అనంతరం రేపు భారత్-ఇంగ్లాండ్ (india versus england)మధ్య రెండో సెమీ పైనల్ ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లాండ్ హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. అయితే సన్నాహాల సంగతి ఎలా ఉన్నా టీమిండియాలోని ఓ ఫామ్ లో లేని బ్యాటర్ ఇప్పుడు ఇంగ్లండ్ కు పీడకలగా మారిపోతున్నాడట. ఆ విషయాన్ని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కర్రాన్ స్వయంగా వెల్లడించాడు.
సెమీఫైనల్ పోరుకు ముందు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లో లేనప్పటికీ, తమ జట్టు అతని పట్ల అత్యంత అలర్ట్ గా ఉందని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ వెల్లడించాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్ ల్లో కలిపి అభిషేక్ చేసిన పరుగులు 80 మాత్రమే. అయినా ఇంగ్లండ్ అతని విషయంలో అలర్ట్ గా ఉందని కర్రాన్ తెలిపాడు. గతేడాది వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ పై 54 బంతుల్లోనే 135 పరుగులు చేసిన చరిత్ర ఉన్న అభిషేక్ .. ఈసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడతాడని అనుకోవడం లేదన్నాడు.

ఈసారి అభిషేక్ శర్మ మళ్ళీ అదే రకమైన ఆటను ప్రదర్శించకూడదని తాను ఆశిస్తున్నట్లు సామ్ కర్రాన్ తెలిపాడు. తాము ఈ మ్యాచ్ కు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తమ దృష్టంతా రేపు జరిగే మ్యాచ్ పైనే ఉందన్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు అవుతుందని తాను ఆశిస్తున్నానని కర్రాన్ తెలిపాడు. అయితే, భారత్ లో ఉన్న పరిస్థితులలో, ప్రత్యర్థిపై ఆడటంలో ఇంగ్లాండ్ జట్టు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు ఎలాంటి భయాలు లేవన్నాడు. భారత్ నాణ్యమైన జట్టు అని, అయినా తాము ఇక్కడ చాలా క్రికెట్ ఆడామని గుర్తుచేసుకున్నాడు. తమ జట్టులో ఎక్కువ మంది ఐపీఎల్‌లో ఆడారని, భారత్‌తో క్రమం తప్పకుండా ఆడారని తెలిపాడు.












Click it and Unblock the Notifications