Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SRH: కావ్య పాపకు బీపీ పెంచేస్తున్న టీమిండియా ప్లేయర్..! గాల్లో దీపంలా 14 కోట్లు..!

ఐపీఎల్ 2026 (Ipl 2026) ఆరంభానికి మరో నెల రోజులు మాత్రమే గడువు ఉంది. భారత్, శ్రీలంకల్లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ను ఐపీఎల్ జట్లన్నీ తమ ఆటగాళ్లకు సన్నాహకంగా భావిస్తున్నాయి. వరల్డ్ కప్ వంటి టోర్నీని ఐపీఎల్ కు రిహార్సల్స్ గా మార్చుకునేందుకు ప్రతీ ఐపీఎల్ ఆటగాడూ ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టీమ్ ఇండియాలో కీలకంగా ఉన్న ఆటగాడు పేలవ ఫామ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటుండటం ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కలవరపెడుతోంది. అతనే అభిషేక్ శర్మ (Abhishek Sharma).

సన్ రైజర్స్ కు తలనొొప్పిగా అభిషేక్ ఫామ్ (Abhishek Sharma)

ఐపీఎల్ వేళ టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి నిద్రలేని రాత్రుల్ని తెస్తోంది. ముఖ్యంగా గత ఐపీఎల్ లో రెచ్చిపోయి ఆడి, దాంతో ఏకంగా టీమ్ ఇండియాలో సైతం స్ధానం సంపాందించేసిన అభిషేక్ ను ఈసారి ఐపీఎల్ లో రిటైన్ చేసుకునేందుకు సన్ రైజర్స్ రూ.14 కోట్లు వెచ్చిస్తోంది. ఇలాంటి సమయంలో అభిషేక్ టీ20 వరల్డ్ కప్ లో మూడు డకౌట్ లు కావడం, ఆడిన సూపర్ 8 మ్యాచ్ లోనూ 15 పరుగులే చేయడంతో కావ్యా మారన్ లో టెన్షన్ పెంచేస్తుందట.

Abhishek Sharma s Woes Deepen SRH s Big Headache Ahead of IPL 2026

వరల్డ్ కప్ లో చేసినవి 15 పరుగులే

టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ అభిషేక్ శర్మ చేసిన పరుగులు కేవలం 15 మాత్రమే. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 193.39 సగటుతో 439 పరుగులు చేసిన అభిషేక్ ఈసారి 2026 ఐపీఎల్ ఆరంభ వేళ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. వరల్డ్ కప్ ప్రారంభ వేళ అనారోగ్యానికి గురైన అభిషేక్ కు తాజా ఫామ్ లేమి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అతని తాజా ఫామ్ తో టీమిండియాకు సైతం ఇబ్బందులు తప్పట్లేదు. అదే సమయంలో ఐపీఎల్ సన్ రైజర్స్ లోనూ టెన్షన్ పెరిగిపోతోంది.

SRH Abhishek Sharma s Woes Deepen SRH s Big Headache Ahead of IPL 2026

సన్ రైజర్స్ 14 కోట్లు గాల్లోనే

అభిషేక్ శర్మపై అంచనాలు అతనికి భారంగా మారాయని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. అందుకే పేస్, స్పిన్ దేన్నీ సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాడని తెలిపారు. అలాగే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ ఈ పతనం సాంకేతిక సమస్య కంటే మానసిక సమస్యగా చూడాలంటున్నాడు. దూకుడు శైలి కారణంగా విజయవంతమైన అభిషేక్ కు ఇప్పుడు అదే దూకుడు శాపంగా మారిందంటున్నారు. ఇదే పరిస్దితి కొనసాగితే అతన్ని 14 కోట్లు పెట్టి కొన్న ఐపీఎల్ సన్ రైజర్స్ తుది జట్టులో చోటు కల్పించడం కూడా కష్టమేనంటున్నారు. ప్రస్తుతానికి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు పలువురు సీనియర్లు అభిషేక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ వరల్డ్ కప్ పూర్తయ్యేసరికి అభిషేక్ ఆటతీరు ఇలాగేే ఉంటే సన్ రైజర్స్ పునరాలోచించుకోక తప్పని పరిస్దితి ఎదురయ్యేలా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+