T20 World Cupలో భారత్ ఓటమి-సీవీ ఆనంద్ లెక్కే నిజమైందా ?
టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026)లో వరుస విజయాలతో జైత్రయాత్ర చేస్తున్న టీమిండియాకు అనూహ్య షాక్. అదీ సొంతగడ్డపైనే. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో భారీ ప్రేక్షకుల మద్దతున్న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో సూర్య సేన ఓడిపోయింది. దీంతో వరల్డ్ కప్ తో పాటు టీ20ల్లో భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అయితే ఈ ఓటమి తర్వాత దీనిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అందులో ఒకటి స్వతహాగా క్రికెటర్, క్రికెట్ వీరాభిమాని అయిన తెలంగాణ ఐపీఎస్ సీవీ ఆనంద్ (CV Anand) చెప్పిన లా ఆఫ్ యావరేజెస్ (సగటుల సూత్రం).
సరిగ్గా ఐదు రోజుల క్రితం నెదర్లాండ్స్ జట్టుపై గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ ఓటమి అంచుల వరకూ వెళ్లి గెలిచింది. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో అమెరికా చేతిలోనూ దాదాపు ఇదే పరిస్దితి. జట్టు సంక్షోభంలో ఉన్నప్పుడల్లా ఎవరో ఒకరు ఆదుకోవడం, ఓటమి బాట నుంచి గెలుపు సాధించడం ఇలా సాగిపోయింది వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్ధానం. అయితే నెదర్లాండ్స్ పై గెలుపుతో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి అజేయంగా సూపర్ 8లోకి భారత్ అడుగుపెట్టాక ఈ మ్యాచ్ ఓడిపోతే బాగుండేదంటూ సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.

Was reading this and felt “ would have been better to lose this one !” Am a firm believer of the LOA s ( Law of Averages) due to my own experiences! One loss somewhere in the league stage , along the route to the finals , helps win trophies !
— CV Anand IPS (@CVAnandIPS) February 19, 2026
What say ? I know some of you don’t… pic.twitter.com/KbqmmR6sPL
నెదర్లాండ్స్ పై భారత్ గెలిచిన వార్తకు సంబంధించిన ఓ పేపర్ క్లిప్ ను ఎక్స్ లో షేర్ చేస్తూ.. ఈ మ్యాచ్ ఓడిపోతే బాగుండేదని సీవీ ఆనంద్ తెలిపారు. తన అనుభవాల ఆధారంగా లా ఆఫ్ యావరేజెస్ ను తాను బాగా నమ్ముతానని, ఫైనల్ కు వెళ్లే దారిలో లీగ్ స్టేజ్ లో ఎక్కడో ఒక చోట ఓడిపోతేనే ట్రోఫీని అందుకుంటామనేది ఈ సూత్రమని సీవీ ఆనంద్ వెల్లడించారు. తన వాదనతో కొందరు ఏకీభవించకపోవచ్చని కూడా ఆయన చెప్పేశారు. అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి తర్వాత ఈ వరల్డ్ కప్ లో భారత్ గెలిచి తీరుతుందన్న నమ్మకం వచ్చినట్లయింది. సీవీ ఆనంద్ లెక్క ప్రకారం భారత్ సూపర్ 8 తొలి మ్యాచ్ ల ఓడింది కాబట్టి, ఇకపై జరిగే రెండు మ్యాచ్ లు భారీ తేడాలతో గెలిచి సెమీస్ కు, అక్కడి నుంచి ఫైనల్ కు చేరి ట్రోఫీ కొడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications