T20 World Cup: విండీస్ తో మ్యాచ్ కు టీమ్ వ్యూహమదే-బయటపెట్టిన సూర్య..!
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)లో సెమీస్ కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన సూపర్ 8 మ్యాచ్ లో ఎల్లుండి అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే సూపర్ 8 తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమితో సెమీస్ అవకాశాల్ని సంక్షిష్టం చేసుకున్న సూర్య సేన.. ఆ తర్వాత జింబాబ్వేపై ఘన విజయంతో దాన్ని కాస్త కవర్ చేసుకుంది. ఇప్పుడు విండీస్ తో జరిగే సూపర్ 8 మ్యాచ్ గెలిస్తే కచ్చితంగా సెమీస్ కు చేరే అవకాశం ఉండటంతో వ్యూహాలకు పదునుపెడుతోంది.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో బాగానే గెలిచినా టీమ్ బౌలింగ్ లోపాలన్నీ బయటపడ్డాయి. వాటిని ఇప్పుడు వెస్టిండీస్ సరిగ్గా వాడుకుంటే భారత్ కు ఎదురుదెబ్బ తప్పదు. ఈ నేపథ్యంలో జట్టు బౌలింగ్ పై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (suryakumar yadav) అసంతృప్తిగా ఉన్నాడు. తాము బంతితో మరింత క్లినికల్‌గా ఉండే అవకాశం ఉందని సూర్య గుర్తుచేశాడు. వెస్టిండీస్‌తో ఆడేటప్పుడు తాము స్క్రూలను బిగించుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

జింబాబ్వే బ్యాటర్ల నుండి క్రెడిట్ తీసుకోవట్లేదని సూర్య వెల్లడించాడు. వారు తెలివిగా బ్యాటింగ్ చేశారని, తాము తమ జట్టు ఎంపికతో మరింత స్మార్ట్ గా ఉండాల్సిందన్నాడు. అయితే జరిగిందేదో జరిగింది, ఇప్పుడు దాన్ని వదిలేసి విండీస్ తో మ్యాచ్ కోసం తమ వీడియో విశ్లేషకుడు ఒక స్లయిడ్‌ను సిద్ధం చేశాడని సూర్య వెల్లడించాడు. ఇందులో గత సంవత్సరంలో తాము ఎక్కడ సక్సెస్ అయ్యామో ఇందులో హైలెట్ చేశాడని తెలిపాడు. తాము దానిని చూశామని, దాని నుండి చాలా సానుకూలతను తీసుకున్నామని తెలిపాడు. టాప్ ఆర్డర్ నుంచి ఏడో నంబర్ వరకు చూస్తే తమ ప్రదర్శనలో ఎలాంటి లోపాలు లేవని గుర్తించామన్నాడు. కాబట్టి బౌలింగ్ ను సరి చేసుకుంటే సరిపోతుందనేలా సూర్య వ్యాఖ్యలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications