టీమిండియా సూపర్ 8 ప్రత్యర్థులు ఫిక్స్, ఎవరితో ఎప్పుడు - ఆ టీంతోనే అసలు టెన్షన్..!!
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. అసలైన సమరం మొదలు కానుంది. సూపర్ 8 కు జట్లు దాదాపు ఖరారయ్యాయి. టీమిండియా సూపర్ 8 ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. సూపర్ 8 దశలో మూడు టీంలతో సూర్య సేన తలపడనుంది. అయితే, ప్రపంచ కప్ నుంచి ఆసీస్ నిష్క్రమించింది. అనూహ్యంగా చిన్ని జట్లు సూపర్ 8 వైపు దూసుకొస్తున్నాయి. పాక్ భవితవ్యం నేడు తేలిపోనుంది. ఈ సమయంలోనే టీమిండియా సూపర్ 8 లో ఆడే మూడు మ్యాచ్ లు చావో రేవో అన్నట్లుగా మారుతున్న వేళ ఆ టీం మాత్రం టెన్షన్ పెడుతోంది.
టీ20 ప్రపంచ కప్ లో సూర్య సేన దూకుడు మీద ఉంది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి సూపర్ 8 లో అడుగు పెట్టింది. ఇప్పుడు సూపర్ 8 లో మూడు మ్యాచ్ లు ఆడనుంది. మూడు టీంలతో షెడ్యూల్ ఫిక్స్ అయింది. లీగ్ దశలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలకు తగినట్లుగా ఆడలేదు. గ్రూప్-A నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. నెట్ రన్‌రేట్ భారీగా తగ్గిపోవడంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఈ రోజు పాకిస్థాన్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నమీబియాపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెలవకుంటే గ్రూప్ దశలోనే అవమానకర నిష్క్రమణ తప్పదు. పాక్ సూపర్ 8కు చేరితే... సెమీస్ లో భారత్ - పాక్ మధ్య మరోసారి పోరు ఉండే అవకాశం ఉంది.

ఇక హోరా హోరీ మ్యాచ్ లు.. ఆ టీం పై కొత్త అంచనాలు
కాగా, సూపర్ 8 కు చేరిన టీమిండియా ఆడే మ్యాచుల షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అదే విధంగా ఈ నెల 26న చెన్నైలో జింబాబ్వేతో టీమిండియా ఆడనుంది. ఇక, చివరి మ్యాచ్ మార్చి 1 న కోల్ కతాలో వెస్టీండీస్ తో టీమిండియా తల పడనుంది. సూపర్-8 షెడ్యూల్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వేతో హై-వోల్టేజ్ మ్యాచ్‌ల కోసం సూర్య సేన సమాయత్తం అవుతోంది. ఇక.. ఈ రోజు టీమిండియా నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడిన తర్వాత, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ సూపర్-8 తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతోంది. అయితే, సూపర్ 8 లో ప్రతీ మ్యాచ్ లో గెలుపు తో పాటుగా రన్ రేటు సైతం సీలకంగా మారనుంది. ఈ దశలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో మ్యాచ్ లు కీలకంగా మారనున్నాయి. జింబాబ్వేతోనూ తక్కువ అంచనా వేయటానికి వీలు లేని విధంగా ఆ టీం నిలచింది. వెస్టీండీస్ తో మ్యాచ్ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీంతో.. సూపర్ 8 వేళ రోహిత్ సైన పైన ఫ్యాన్స్ లో మాత్రం భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications