T20 World Cup: నమీబియాతో మ్యాచ్ కు కీలక మార్పులు..! భారత్ ఫైనల్ XI ఇదే?
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)లో భాగంగా భారత్ నమీబియాతో తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఓపెనర్ అభిషేక్ శర్మ ఆస్పత్రిపాలుకావడం, మరికొన్ని కారణాలతో ఈ మార్పులు జరుగుతున్నాయి. అయితే నమీబియాతో మ్యాచ్ కు ఫైనల్ టీమ్ ఎంపిక కోసం హెడ్ కోచ్ గౌతం గంభీర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది.
భారత జట్టులో మార్పులు (t20 world cup)
టీ20 వరల్డ్ కప్ ను భారత్ పేలవంగానే ఆరంభించింది. అమెరికాతో మ్యాచ్ లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్ధాయిలో లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ .. అమెరికాతో మ్యాచ్ గెలిచేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. అదే సమయంలో నమీబియాతో జరగనున్న గ్రూప్ ఏ మ్యాచ్ కోసం భారత జట్టు ఎంపిక మేనేజ్ మెంట్ కు సవాలుగా మారింది. తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రి పాలైన అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయినా ఇంకా కోలుకోలేదు. అలాగే ఇషాన్ కిషన్ కూడా నెట్స్ లో గాయపడ్డాడు. అయితే మ్యాచ్ కల్లా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ లో ఇలా
దీంతో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ జోడీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే వన్ డౌన్లో తిలక్ వర్మ, సెకండ్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ వస్తారు. ఆ తర్వాత అల్ రౌండర్లు శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా ఉంటారు. బౌలింగ్ విభాగంలో జ్వరం నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో అతని స్ధానంలో జట్టులోకి వచ్చిన సిరాజ్ పెవిలియన్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఫైనల్ ఎలెవన్ ఖరారు ?
స్పిన్ కు అనుకూలించే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో మ్యాచ్ కు .. కుల్దీప్ యాదవ్ ను చేర్చుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. పిచ్ ఎక్కువ పొడిగా కనిపిస్తే.. సీమర్లలో ఒకరిని లేదా వరుణ్ చక్రవర్తిని తీసుకోవచ్చు. సైడ్ స్ట్రెయిన్ నుండి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. దీంతో సందర్ లేదా రింకూల్లో ఒకరికే ఛాన్స్ దక్కవచ్చు. ఈ లెక్కన దాదాపు ఖరారైన తుది జట్టును చూస్తే.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉంటారు.












Click it and Unblock the Notifications