T20 World Cup 2024: అమెరికాలో అడుగుపెట్టిన టీమిండియా..! మెగా టోర్నీకి సన్నాహాలు..!
ఐపీఎల్ 2024 టోర్నీ ముగియడంతో వచ్చే నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ పై ఇప్పుడు అన్ని జట్లూ దృష్టిసారిస్తున్నాయి. రెండు నెలలుగా ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లంతా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా పలు దేశాల జట్లు ఇప్పటికే అమెరికా చేరుకుంటున్నాయి. ఇదే క్రమంలో టీమిండియా కూడా అమెరికాలోని న్యూయార్క్ కు చేరుకుంది.
న్యూయార్క్ లో టీమిండియా క్రికెటర్లు అడుగుపెట్టిన వీడియోను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం షేర్ చేసింది. న్యూయార్క్ లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ సన్నాహాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్ధానంలో ఉన్న రోహిత్ సేనపై టీ20 వరల్డ్ కప్ లోనూ భారీ అంచనాలున్నాయి. అయితే అమెరికా, వెస్టిండీస్ లో వాతావరణం మాత్రం వీరికి సవాలు కానుంది.

✈️ Touchdown New York! 🇺🇸👋#TeamIndia 🇮🇳 have arrived for the #T20WorldCup 😎 pic.twitter.com/3aBla48S6T
— BCCI (@BCCI) May 27, 2024
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా న్యూయార్క్ కు చేరుకుంటున్నారు. ఐపీఎల్ టోర్నీ ఫైనల్ ఆడని ఆటగాళ్లు ఇవాళ న్యూయార్క్ చేరుకున్నారు. మిగిలిన వారు రెండో విడతలో ఇక్కడికి వస్తారు. ఆలోపు తొలి దశలో అమెరికా వచ్చిన వారు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆడే టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించాక తనను తాను నిరూపించుకునేందుకు టీ20 వరల్డ్ కప్ మంచి వేదిక అవుతుందని రోహిత్ కూడా ఆశాభావంగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications