ధోనీకి అరుదైన గౌరవం - బీసీసీఐ కీలక నిర్ణయం, ఫ్యాన్స్ ఫిదా..!!
బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీకి ఏ మాత్రం ఫ్యాన్స్ లో ఆదరణ తగ్గలేదు. టీం ఇండియాకు తన కెప్టెన్సీలో ప్రపంచకప్ అందించాడు. టీమిండియాకు ఆడినన్ని రోజులు ధోనీ భారత క్రికెట్‌కు విశిష్ట సేవలందించాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహీకి భారత క్రికెట్ బోర్డు అరుదైన గౌరవం కల్పించింది. తాజాగా బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ధోనీకి అరుదైన గుర్తింపు : భారత్ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. జెర్సీ నంబర్ 10 అంటే సచిన్ గుర్తుకొస్తారు. జెర్సీ నెం. 7అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకొస్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత అతని జెర్సీ నంబర్ 10కి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ పై ఉన్న గౌరవంతో భవిష్యత్ లో ఏ భారత క్రికెటర్ కు ఆ జెర్సీ నెంబర్ ను కేటాయించబోమని బీసీసీఐ అప్పట్లో చెప్పుకొచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అదే గౌరవం ఇచ్చింది. యువ ఆటగాళ్లు, ప్రస్తుతం భారత జట్టు ఆటగాళ్లు ధోనీ నంబర్ 7 జెర్సీని ఎంచుకోవద్దని బీసీసీఐ నిర్ణయించింది. ఇకపై ధోనీ జెర్సీ నంబర్‌ని ఎవరికి కేటాయించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ధోనీ జెర్సీ నెంబర్7 : సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచికూడా తరచూ ఇలాంటి డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా బీసీసీఐ ధోనీకి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్ క్రికెట్ కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఎంఎస్ ధోనీ ఏడో నంబర్ జెర్సీని ఎవరూ ఎంచుకోవద్దని ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు, యంగ్‌స్టర్స్‌కు సూచించింది. ప్రస్తుతానికి ఆటగాళ్ల కోసం 60 సంఖ్యలు ఉన్నాయి. ఒకవేళ ఏ ప్లేయర్ అయినా ఏడాదికాలం జట్టుకు దూరమైన అతడి జెర్నీ నంబర్‌ను కొత్తవాళ్లకు ఇవ్వకూడదనే నిర్ణయం అమలవుతోంది.

ఐపీఎల్ లో సంచనాలతో : ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2019 వరల్డ్ కప్‌తో ధోనీ కెరీర్ ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో రనౌట్‌గా వెనుదిరిగిన ధోనీ ఆ క్షణమే ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. తన నిర్ణయాన్ని మాత్రం 2020 ఆగస్టు 15న ప్రకటించాడు. ప్రస్తుతం మహీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపిన మహీ తన కెప్టెన్సీలో పస తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు బీసీసీఐ ఇచ్చిన అరుదైన గౌరవం తో మహీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications