ఆసుప‌త్రిలో చేరిన క్రికెట్ దిగ్గ‌జం.. ప‌రిస్థితి విష‌మం!

ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గ‌జం లెజెండ్ జెఫ్రి బాయ్‌కాట్ (83) మ‌ళ్లీ ఆసుప‌త్రిలో చేరారు. న్యూమోనియా కార‌ణంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మారింద‌ని కుటుంబ‌స‌భ్యులు వివ‌రించారు. గొంతు క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇటీవ‌లే శ‌స్త్ర చికిత్స చేయించుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, న్యూమోనియా పెర‌గ‌డంతో ఆదివారం తిరిగి ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆహారం కూడా తీసుకోలేక‌పోతున్నార‌ని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించిద‌ని.. వెంటిలేష‌న్ మీద చికిత్స తీసుకుంటున్నార‌ని జెఫ్రి కూతురు ఎమ్మా పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా జెఫ్రి కూతురు ఎమ్మా సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. 'మా నాన్న జెఫ్రీ బాయ్‌కాట్ కోలుకోవాలని కోరుకుంటున్నవారంద‌రికీ ధన్యవాదాలు. ఆయనకు మద్దతుగా ఉన్న ఆయ‌న అభిమానులను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దురదృష్టవశాత్తూ నాన్న ఆరోగ్య పరిస్థితి విష‌మించింది. న్యూమోనియా కార‌ణంగా ఆయ‌న బాగా ఇబ్బందిప‌డుతున్నారు. ఆహారం కూడా తీసుకులేక‌పోతున్నారు. క‌నీసం ద్ర‌వ ప‌దార్థాలు కూడా సేవించ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వెంటిలేషన్‌ మీద ఉన్నారు. ట్యూబ్‌ ద్వారానే ఆహారా ప‌దార్థాల‌ను అందిస్తున్నాం.. అంటూ జెఫ్రి బాయ్‌కాట్ కూతురు ఎమ్మా ట్టిట్వ‌ర్ వేదిక‌గా తెలిపారు.

The cricket legend Geoffrey boycott health critical

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించారు..

క్రికెట్ దిగ్గ‌జం జెఫ్రీ బాయ్‌కాట్ మొద‌టిసారిగా 2002లో క్యాన్సర్‌కు గుర‌య్యారు. ఈ వ్యాధితో చాలా కాలం పాటు ఆయ‌న పోరాడాల్సి వ‌చ్చింది. ఈ మ‌హ‌మ్మారికి కీమో థెరఫీ చేయించుకుని కోలుకోవ‌డం కూడా జ‌రిగింది. కానీ, 2024 మే నెలలో క్యాన్సర్‌ తిరగబెట్టడంతో మ‌రోసారి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ అంత‌లోనే ఆయ‌న‌ను న్యూమోనియా అటాక్ చేసింది. దాంతో జెఫ్రి ఆరోగ్య ప‌రిస్థితి బాగా విష‌మించింది. ఆయన ఇంగ్లండ్ త‌ర‌పున ఎన్నో మ్యాచులు ఆడారు. ఇంగ్లండ్ తరఫున 108 టెస్టుల్లో 8,114 పరుగులు చేసి రికార్డులు సృష్టించారు.

36 వన్డేల్లో 1082 రన్స్ బాదిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కింది. 100 ఫస్ట్-క్లాస్ సెంచరీలు కూడా ఆయ‌న పేరుమీద ఉన్నాయి. ఇక‌, టెస్టుల అనంత‌రం 1978లో ఆయ‌న కెప్టెన్‌గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆ త‌ర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక‌.. వార్తాపత్రికలో ప‌నిచేశారు. ఆ త‌ర్వాత బ్రాడ్‌కాస్టర్‌గా చేశారు. అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిలో చాలా మార్పులు వ‌చ్చాయి. హార్ట్ బైపాస్ సర్జరీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో జెఫ్రి కామెంటేటర్ కెరీర్‌ను కూడా ముగించాల్సి వ‌చ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+