T20 World Cup 2024: ఈసారి అమెరికా జట్టులో ముగ్గురు ఇండియన్స్-అండర్ 19 టీమ్ కెప్టెన్ సహా..!
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ 2024 ఈ ఏడాది జూన్ 2న ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంతో పోలిస్తే పెరిగిన జట్లు, ఆట ప్రమాణాలు, ఇంకా ఎన్నో అంశాలు ఈసారి క్రికెట్ అభిమానులకు పండగ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం కూడా ఈసారి వెలుగుచూసింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్న అమెరికా జట్టులో ఏకంగా ముగ్గురు భారతీయులున్నారు.
ఈసారి అమెరికా జట్టులో ఆడబోతున్న క్రికెటర్లతో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. వీరంతా భారత్ గెలిచిన అండర్ 19 వరల్డ్ కప్ 2012లో ఆడిన వారే. 2012లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ గెల్చుకుంది. ఈ టోర్నీలో భారత్ కు విజయాన్ని అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్ తో పాటు జట్టులో ఉన్న మరో ఇద్దరు క్రికెటర్లు హర్మీత్ సింగ్, స్మిత్ పటేల్ ఇప్పుడు అమెరికా జట్టులో ఆడబోతున్నారు. వీరు అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా అవకాశాలు దక్కకపోవడంతో అమెరికాకు వలసపోయి ఆ జట్టు తరపున టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు సిద్దమవుతున్నారు.

T20 ప్రపంచ కప్ భాగంగా జూన్ 5న టీమిండియా అమెరికాతో తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో గతంలో అండర్ 19 స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు ఆటగాళ్లలో ఎంత మందికి చోటు దక్కనుందనే ఉత్కంఠ నెలకొంది.2012 అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జట్టులో ఉన్న ఈ ముగ్గురు ఇప్పుడు అమెరికా తరఫున ఆడి భారత్ పై చేసే ప్రదర్శన కూడా కీలకం కానుంది.












Click it and Unblock the Notifications