Ind Vs Eng T20: ఇంగ్లాండ్ తో సిరీస్ వేళ క్రికెట్ ఫ్యాన్స్ కు బంపరాఫర్..!!

క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ అప్డేట్. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా సొంత గడ్డ పైన ఇంగ్లాండ్ తో కీలక సమారానికి సిద్దమైంది. నేడు కోల్ కతా వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆసీస్ తో బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ పరాజయం తో టీమిండియా పైన విమర్శలు పెరిగాయి. టీంలో స్థానం పైన సీనియర్ ఆటగాళ్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం ప్రకటించింది.

సమరానికి సిద్దం
నేటి నుంచి టీమిండియా సొంత గడ్డపైన ఇంగ్లాండ్ తో టీ20 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయిదు టీ 20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు బరిలో దిగుతుంది. కానీ, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షమీ వైపు ఆసక్తి గా ఉన్నారు. ప్రపంచ కప్ లో టీమిండియా కు చివరి వరకు ఆశలు పెంచిన షమీ... ఆ తరువాత టీంకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ ద్వారా షమీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జట్టులోకి చేరాడు. ఈ సిరీస్‌లో షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే రానున్న ఛాంపీయన్స్ ట్రోఫీలో మరోసారి జట్టులో కీలకంగా మారనున్నాడు.

TNCA announced free metro travel to and from the Chidambaram Stadium for Ind Vs Eng T20 match ticket holders

భారీ అంచనాలు
రెండు జట్లు ఈ సిరీస్ లో సమాన బలంతో బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్ లోనే గెలుపుతో సిరీస్ ను ప్రారంభించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది. ఓపెనర్ సంజు సామ్సన్, అభిషేక్ తమ జోరు కొనసాగిస్తే టీం ఎంతటి స్కోర్ అయినా నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్, రింకూసింగ్ బ్యాటింగ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ ఈ నెల 25న చెన్నైలో చెపాక్ స్టేడియం లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఫ్యాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఉచిత మెట్రో
రెండో టీ 20 మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియం వద్దకు వచ్చే క్రికెట్ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం కల్పిస్తున్నట్లు టీఎన్సీఏ ప్రకటించింది. మ్యాచ్ టికెట్లు ఉన్న ప్రతీ ఒక్కరూ చెన్నై మెట్రోలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. గతంలోనూ 2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లకు ఉచిత మెట్రో ప్రయాణ సౌకర్యం కల్పించింది. తిరిగి, ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+