IPL 2025: ఐపీఎల్‌లో అత్యధిక అర్థ శతకాలు బాదిన బ్యాటర్లు వీరే..
IPL 2025: టీమిండియా ఫ్యాన్స్ ను 20 రోజుల పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అలరించింది. భారత జట్టు రికార్డులను తిరగరాస్తూ మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను దక్కించుకుంది. భారత్ విజయంతో ఫ్యాన్స్ ఎంతో ఖుషీగా ఉన్నారు. అయితే క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నో సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్థ శతకాలు బాదిన టాప్-5 బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను ఐపీఎల్ లో దిగ్గజంగా పరిగణిస్తారు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు వార్నర్ పేరు మీద ఉంది. డేవిడ్ వార్నర్ 184 మ్యాచ్‌లలో 62 అర్థ శతకాలను సాధించాడు.
విరాట్ కోహ్లీ
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఆడిన 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 55 అర్థ శతకాలు బాదాడు.

శిఖర్ ధావన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో 222 మ్యాచ్ లలో వెటరన్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ 51 హాఫ్ సెంచరీలు సాధించాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కెరీర్లో ఇప్పటివరకు 257 మ్యాచ్ లు ఆడాడు. అందులో రోహిత్ బ్యాట్ నుంచి 43 హాఫ్ సెంచరీలు వచ్చాయి.
ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్ లలో 40 హాఫ్ సెంచరీలు సాధించాడు.












Click it and Unblock the Notifications