US Open 2026: గంజాయి వాసనతో మ్యాచ్‌కు అంతరాయం!(వీడియో)

US Open 2026: శుక్రవారం (సెప్టెంబర్ 4) యూఎస్ ఓపెన్ 2026 టోర్నీలో ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా మ్యాచ్ సందర్భంగా ఓ విచిత్రమైన, ఊహించని పరిస్థితి తలెత్తింది. సాధారణంగా క్రీడాకారుల గాయాలు లేదా వర్షం వంటి సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగడం చూస్తుంటాం. కానీ సబలెంకా మ్యాచ్ సమయంలో మాత్రం స్టాండ్స్ నుంచి వెలువడుతున్న గంజాయి ఘాటైన వాసన కారణంగా ఆటను కొద్దిసేపు నిలిపివేయాల్సి వచ్చింది.

IND vs PAK: దాయాదుల సమరం.. భారత్‌కు బిగ్ ఛాలెంజ్!
IND vs PAK: దాయాదుల సమరం.. భారత్‌కు బిగ్ ఛాలెంజ్!

సర్వ్ చేస్తుండగా ఘాటైన వాసన
సబలెంకా లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో కమీలా రఖిమోవాతో మూడవ రౌండ్ మ్యాచ్ ఆడుతుండా ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లోని మూడో గేమ్ సమయంలో ఆమెకు స్టాండ్స్ నుండి గంజాయి వాసన బలంగా వచ్చింది. సబలెంకా సర్వ్ చేస్తున్నప్పుడు స్కోరు 30-0గా ఉన్న సమయంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. కోర్టు దక్షిణ భాగం నుంచి సర్వ్ చేస్తుండగా.. ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి అకస్మాత్తుగా చైర్ అంపైర్ వైపు తిరిగి స్టాండ్స్ వైపు చూపించారు. ఆమె అంపైర్‌తో, "ఎవరో గంజాయి తాగుతున్నారు" అని చెప్పారు.ఆ తర్వాత సబలెంకా ఆ వాసన చాలా తీవ్రంగా ఉండటంతో దాన్ని విస్మరించడం కష్టంగా ఉందని, జోక్యం చేసుకోవాలని అంపైర్‌ను అభ్యర్థించారు.

US Open 2026 Aryna Sabalenka Complains of Marijuana Smell During Match Video Goes Viral

"దీని గురించి ఏమైనా చేస్తారా, ఎందుకంటే వాసన చాలా ఘాటుగా ఉంది," అని సబలెంకా అడిగింది. సబలెంకా ఫిర్యాదు చేసిన వెంటనే అంపైర్ సహాయం కోసం స్టేడియం సిబ్బందిని పిలిచారు. యూఎస్ ఓపెన్ సిబ్బంది స్టాండ్స్‌లోకి వెళ్లి గంజాయి వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.ఈ సంఘటన కారణంగా మ్యాచ్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది, కానీ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభమైంది.

జట్టు ఓడిపోతేనేం.. లిక్కర్ షాప్ ముందు పీసీబీ ఛైర్మన్ హంగామా! (వీడియో)
జట్టు ఓడిపోతేనేం.. లిక్కర్ షాప్ ముందు పీసీబీ ఛైర్మన్ హంగామా! (వీడియో)

మన్నారినో కూడా ఫిర్యాదు చేశారు..
టోర్నమెంట్ సమయంలో గంజాయి వాసనపై అడ్రియన్ మన్నారినో కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం సబలెంకా ఆటపై ఎక్కువసేపు ప్రభావం చూపలేదు. ఈ బెలారస్ క్రీడాకారిణి రఖిమోవా సవాలును అధిగమించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. సబలెంకా మ్యాచ్‌ను దూకుడుగా ప్రారంభించింది. ఈ విజయంతో తన యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కాపాడుకునే సబలెంకా పోరాటం కొనసాగుతోంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+