జట్టు ఓడిపోతేనేం.. లిక్కర్ షాప్ ముందు పీసీబీ ఛైర్మన్ హంగామా! (వీడియో)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. లండన్‌లోని ఓ లిక్కర్ స్టోర్ బయట కూర్చొని ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో బయటకు రావడంతో పాక్ క్రికెట్ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
మద్యం బాటిళ్ల ముందే ఇంటర్వ్యూ
లండన్ వేదికగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనక మద్యం సీసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా అక్కడికి వచ్చిన ప్రజలు మద్యం కొనుగోలు చేస్తూ వెళ్లడం కూడా వీడియోలో రికార్డైంది. ఇస్లాంలో 'మద్యం హరామ్' అనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఓ బాధ్యతాయుతమైన బోర్డు ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి మద్యం షాప్ బయట కూర్చొని మాట్లాడటం ఏంటని నెటిజన్లు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జట్టు పరాజయాలను సమర్థించుకున్న నఖ్వీ
ఈ విమర్శల నడుమ ఇంటర్వ్యూలో మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనను వింత పోలికలతో సమర్థించుకునే ప్రయత్నం చేశారు. "గతంలో సౌతాఫ్రికా నమీబియా చేతిలో, భారత్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయాయి.. అంతమాత్రాన అక్కడ క్రికెట్ అంతమైపోయిందా? జట్టుకు ఎవరి అవసరం ఉంటే వారిని తప్పకుండా తీసుకువస్తాం" అని నఖ్వీ వ్యాఖ్యానించారు. మొహ్సిన్ నఖ్వీ చేసిన ఈ కామెంట్లపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ క్రికెట్ దుస్థితి
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. మొదటి రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని సిరీస్ ను 2-0తో కోల్పోయింది. జట్టు పేలవ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ.. పర్యటన మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లను తిరిగి స్వదేశానికి పంపించివేసింది. అంతే కాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ లను కూడా బాధ్యతల నుంచి తప్పిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
Mohsin Naqvi responds to the critics. 🗣️🇵🇰
— Talha Nawaz (@TalhaDigital007) September 3, 2026
“South Africa lost to Namibia, and India lost to Ireland. Does that mean their cricket is over? No.
No team becomes a champion overnight. Pakistan have improved from No. 9 to No. 6 in T20Is and from No. 8 to No. 5 in ODIs.”…













Click it and Unblock the Notifications