IND vs PAK: దాయాదుల సమరం.. భారత్‌కు బిగ్ ఛాలెంజ్!

IND vs PAK: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య కీలకమైన 9వ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే హ్యాట్రిక్ విజయంతో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా.. పాకిస్తాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది.

ఆసియా కప్‌లో ఇరు జట్ల రికార్డులు
మహిళల ఆసియా కప్ టోర్నీ చరిత్రలో భారత్-పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 9 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో భా‌రత మహిళల జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 7 సార్లు విజయం సాధించగా.. పాకిస్తాన్ కేవలం 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌కు భారత్‌పై లభించిన ఆఖరి విజయం 2022లో దక్కింది. ఆ తర్వాత నుంచి ఇండియాపై గెలిచేందుకు పాకిస్తాన్ తీవ్రంగా శ్రమిస్తోంది.

IND vs PAK Asia Cup 2026 Harmanpreet Kaur-led India Face Pakistan in Dubai Full Details Here

టీ20 ముఖాముఖి రికార్డు
ఓవరాల్ టీ20 రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 14 మ్యాచ్‌ల్లో జయభేరి మోగించగా.. పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా ఇరు జట్లు టీ20 వరల్డ్ కప్‌లో తలపడగా.. అందులోనూ భారత జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సెమీస్ రేసులో ఇతర జట్లు
ఈ ఆసియా కప్ టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ జట్లతో పాటు థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లు ఉండగా.. గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్-బీ నుంచి వరుస విజయాలతో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్ రేసులో ముందంజలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+