Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..!

నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2026)లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ ఇచ్చిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ఛేదించింది. ఈ మ్యాచ్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (vaibhav sooryavanshi) ఆడిన వీడియో గేమ్ ఇన్నింగ్స్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని అలరించడంతో పాటు ఓ అరుదైన రికార్డుకూ కారణమైంది.

గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఆర్ ఆర్ మ్యాచ్‌లో బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 202 పరుగుల ఛేదనలో ఆర్ఆర్ ఇన్నింగ్స్‌లోని ఐదో ఓవర్‌లో మూడో బంతికి భువనేశ్వర్ కుమార్‌ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి వైభవ్.. 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. వైభవ్ 15 బంతుల్లో చేసిన ఈ 50 పరుగులు.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్ఆర్ తరఫున 15 బంతుల్లో అతనికి ఇది రెండో అర్ధశతకం.

Vaibhav Sooryavanshi Blasts Second 15-Ball IPL Fifty Joins Elite Two-Man Club

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో.. మార్చి 30న గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్‌పై సూర్యవంశీ 15 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇలా 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో రెండు ఐపీఎల్ అర్ధశతకాలు సాధించిన ప్రపంచంలోని రెండో బ్యాటర్‌గా సూర్యవంశీ నిలిచాడు. 2024 ఐపీఎల్ ఎడిషన్‌లో.. ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 15 బంతుల్లో రెండు అర్ధ శతకాలు సాధించాడు. ఇప్పుడు వైభవ్ దాన్ని సమం చేశాడు.

Vaibhav Sooryavanshi Blasts Second 15-Ball IPL Fifty Joins Elite Two-Man Club

ఇలా ఐపీఎల్ లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన వారిలో జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (ఢిల్లీ క్యాపిటల్స్) 2సార్లు,
వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) 2 సార్లు, యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్) ఒకసారి, కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) ఒకసారి, పాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) ఒకసారి, రొమారియో షెపర్డ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఒకసారి, యూసుఫ్ పఠాన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) ఒకసారి, సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) ఒకసారి, నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) ఒకసారి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+