వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో.. !!
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. డంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఉదయం శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నిరాశపరిచాడీ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్ సెన్సేషనల్. టీ20 ఇంటర్నేషనల్స్ కు మొదటిసారి పిలుపు అందుకున్న ఈ యువ ఆటగాడు పర్యటన ఆరంభంలోనే విఫలం కావడం అటు జట్టుకు కూడా ఎదురుదెబ్బగా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది ఇండియా ఏ టీమ్. ఐపీఎల్ సెన్సేషనల్స్ వైభవ్ సూర్యవంశీ, ప్రిభ్ సిమ్రన్ ఇన్నింగ్ ఆరంభించారు. ఈ జోడీ ఎక్కువసేపు క్రీజ్ లో నిల్చోలేకపోయింది. ఇన్నింగ్ నాలుగో ఓవర్ నాలుగో బంతికి వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. మహ్మద్ షిరాజ్ సంధించిన స్లాట్ డెలివరీని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు వైభవ్. సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. స్ట్రెయిట్ మిడాఫ్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని అరచ్చిగె అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 16 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది టీమిండియా ఏ.

12 బంతుల్లో మూడు ఫోర్లతో 14 పరుగులు చేశాడు వైభవ్. ఆ మరుసటి ఓవర్ లోనే ప్రభ్ సిమ్రన్ కూడా పెవిలియన్ దారి పట్టాడు. కరుణరత్నె బౌలింగ్ లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 11 బంతులను ఎదుర్కొన్న సిమ్రన్ రెండు పరుగులే చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య ఫర్వాలేదనిపించుకున్నాడు భారీ స్కో చేయలేకపోయాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 32 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.
దీంతో 13 ఓవర్లల్లో 69 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా ఏ. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్, కేప్టెన్ తిలక్ వర్మ క్రీజ్ లో ఉన్నారు. శ్రీలంక ఏ బౌలర్లల్లో చమిక కరుణరత్నె, మహ్మద్ షిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. శ్రీలంక ఏ, భారత్ ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ ఆడుతున్న ముక్కోణపు సిరీస్ ఇది. శ్రీలంక దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. తన తదుపరి మ్యాచ్ లో ఈ నెల 11న టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది.
ఈ మ్యాచ్ లో.. వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కేప్టెన్), ఆయుష్ బడోని, అనుకుల్ రాయ్, సూర్యాంశ్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్ ఆడుతున్నారు.












Click it and Unblock the Notifications