Vinesh Phogat: కోర్టు తీర్పుపై వినేష్ ఫోగట్ ఫస్ట్ రియాక్షన్-ఒక్క ఫొటోతో తేల్చేసిందిగా..!
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల ఫ్రీస్టైల్ 50కేజీల రెజ్లింగ్ విభాగంలో పతకం అంచులదాకా వచ్చి అనర్హత వేటుతో దాన్ని కోల్పోయిన అథ్లెట్ వినేష్ ఫోగట్ కు చివరికి క్రీడాకోర్టులోనూ నిరాశ తప్పలేదు. వినేష్ ఫోగట్ కు సంయుక్తంగా రజత పతకం పంచుకునే అవకాశం కూడా ఇవ్వకుండా క్రీడాకోర్టు వెలువరించిన తీర్పు కోట్లాది మంది క్రీడాభిమానుల్ని సైతం నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ స్పందించింది.
క్రీడాకోర్టు తీర్పుపై స్పందన అన్నట్లుగా ఇన్ స్టా గ్రామ్ లో వినేష్ ఫోగట్ ఓ ఫొటో పెట్టింది. ఇందులో రెజ్లింగ్ రింగ్ లో వినేష్ తన నుదిటిపై చేతులు పెట్టుకుని చాప మీద పడుకుని ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది. ఇందులో తన బాధను, ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పటికే ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన తర్వాత రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన వినేష్ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ పలు విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయినా వాటిపై స్పందించలేదు.

ఇప్పుడు క్రీడాకోర్టు తీర్పు తర్వాత వినేష్ ఫోగట్ స్పందన చూస్తుంటే ఇక చేసేదేమీ లేదన్నట్లుగా ఆమె కనిపిస్తోంది. వాస్తవానికి కఠినంగా ఉండే ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అనర్హత వేటుకు గురైన తర్వాత ఇక కోలుకోవడం కష్టమని వినేష్ నిర్ణయానికి వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్ కూడా ప్రకటించింది. కానీ స్వదేశంలో ఇదో పెద్ద భావోద్వేగ అంశంగా మారిపోవడంతో క్రీడాకోర్టులో అప్పీల్ చేసింది. అక్కడా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య కూడా తన అప్పీల్ ను వ్యతిరేకించింది. దీంతో సహజంగానే క్రీడాకోర్టు అప్పీల్ ను కొట్టేసింది.












Click it and Unblock the Notifications