కూతురు ఫోటోలు తీయొద్దంటూ ఫోటోగ్రాఫర్లను కోరిన విరాట్ కోహ్లీ..
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి సోమవారం బెంగళూరు నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ముంబయి విమానశ్రయంలో కొందరు ఫోటోగ్రాఫర్ల వామిక ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా కూతురు ఫోటోలు తీయొద్దంటూ ఫోటోగ్రాఫర్లను అభ్యర్థించాడు విరాట్‌కోహ్లీ. న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన అనంతరం భారత క్రికెటర్లందరూ బెంగుళూరు నుంచి ముంబయి చేరుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ కూతురు వామికతో కలిసి బెంగళూరు నుంచి ముంబయికు రావడం జరిగింది.
కూతురు వామికను మీడియాకు దూరంగా ఉంచిన వీరుష్క దంపతులు..:అయితే, ఇప్పటీవరకూ వీరుష్క దంపుతులు కూతురు వామికను మీడియాకు దూరంగా ఉంచారు. వామిక ఫొటోలు ఇంతవరకూ ఎక్కడ బయటకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా నుంచి వీలైనంత వరకు వామిక ఫొటోలు తీయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ దంపతులు. అయితే, ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయంలో మాస్క్ ధరించి కనిపించిన విరాట్ కోహ్లి తన కారు వైపు వెళ్లే ముందు అభిమానులు, ఫోటోగ్రాఫర్ల కోసం కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం కూతురు ఫోటోలు తీయడానికి ముందుకు వచ్చినవారితో ''అరే యార్ బేటీకో ఘర్ లేకే జానా హై'' (నేను నా కూతురిని ఇంటికి తీసుకెళ్లాలి) అని కోహ్లి ఫొటోగ్రాఫర్లకు చెప్పడం జరిగింది.

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 99 సగటుతో 594 పరుగులు పూర్తి చేశారు. నాలుగేళ్ల క్రితం ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే తీయడం జరిగింది. అయితే ఈసారి కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా ఆడనున్నారు.












Click it and Unblock the Notifications