Virat Kohli-Gautam Gambhir: గంభీర్ తో పాత గొడవపై బీసీసీఐకి కొహ్లీ క్లారిటీ ఇదే..!

గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కొహ్లీ, గౌతం గంభీర్ మధ్య తలెత్తిన మాటల యుద్దం ఇరువురి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఇప్పుడు కొహ్లీ ఆటగాడిగా ఉన్న టీమిండియా వన్డే జట్టుకు హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ రాబోతున్నాడు. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య జట్టులో సమన్వయం ఎలా ఉండబోతోంది, గంభీర్ చెప్పినట్లు కొహ్లీ వెంటాడా, కాదని తన రూట్ లోనే వెళ్తాడా ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

నిన్న శ్రీలంకతో వన్డే జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐకి ఫోన్ చేసి తాము అందుబాటులో ఉంటామని కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ చెప్పేశారు. అదే సమయంలో కొహ్లీ.. కొత్త కోచ్ గంభీర్ తో తన పాత వివాదంపైనా బీసీసీఐకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్ బజ్ సమాచారం ప్రకారం గంభీర్ తో తన పాత వివాదం ప్రభావం ఇప్పుడు జట్టుపై పడకుండా ఉండే విషయంపై కొహ్లీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

virat kohli clarified to bcci over working with Gautam Gambhir

గతంలో గంభీర్‌తో తనకున్న విభేదాలు భారత జట్టులో తమ సంబంధాన్ని ప్రభావితం చేయబోవని కోహ్లి బీసీసీఐకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తామరిద్దరూ భారత జట్టుకు ప్రయోజనం కల్పించాలనే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయబోతున్నట్లు కొహ్లీ బీసీసీఐ పెద్దలకు చెప్పారు. కాబట్టి బోర్డు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విరాట్ చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో సంతృప్తి చెందిన బీసీసీఐ.. శ్రీలంక వెళ్లే భారత జట్టులో కొహ్లీ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

వాస్తవానికి గతంలో ఐపీఎల్ సందర్భంగా కొహ్లీ-గంభీర్ మద్య మాటల యుద్ధం చోటు చేసుకున్నా తాజా సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్ గా గౌతం అడుగుపెట్టిన తర్వాత వీరిద్దరూ కూల్ గానే మాట్లాడుకున్నారు. అలాగే గంభీర్ కూడా కొహ్లీతో వివాదంపై గతంలోనే స్పందిస్తూ తామిద్దరి మధ్య బంధం ఎలాంటిదో దేశంలో ఎవరికీ తెలియదన్నాడు. కొహ్లీతో తన బంధం ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదన్నాడు. జనానికి మసాలా ఇవ్వాల్సిన తరహాలో తమ బంధం ఉండక్కర్లేదన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+