11 ఏళ్ల తర్వాత కొహ్లీ చెత్త రికార్డు- ఒకే వన్డే సిరీస్ లో ఇలా..!
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ (Virat Kohli) ప్రస్తుతం న్యూజీలాండ్ లో న్యూజీలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోతున్నాడు. అసలే వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందో లేదా తెలియక టెన్షన్ లో ఉన్న తరుణంలో కివీస్ టూర్ లో వైఫల్యాలు కొహ్లీకి ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. వీటన్నింటి కంటే మించి కొహ్లీ ప్రదర్శన ఎంత దారుణంగా మారిందంటే 11 ఏళ్ల తర్వాత ఓ వన్డే సిరీస్ లో కొహ్లీ ఓ చెత్త రికార్డు నెలకొల్పాడు.
న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో వన్ డౌన్ లో ఆడుతున్న విరాట్ కొహ్లీ .. ఏకంగా మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యారు. ఇలా ఓ వన్డే సిరీస్ లో మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ కావడం కొహ్లీకి 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కివీస్ తో తొలి వన్డేలో 51 బంతుల్లో 74 పరుగులు చేసిన కింగ్ కొహ్లీ .. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ ల్లో మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. తర్వాత జరిగిన రెండు, నాలుగు, ఐదో వన్డేల్లో 7, 0, 5 స్కోర్లకు కొహ్లీ అవుటయ్యాడు. తద్వారా ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచాడు.

11 ఏళ్ల తర్వాత ఓ వన్డే సిరీస్ లో మూడుసార్లు అవుట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా కొహ్లీ 2015లో ఒక వన్డే సిరీస్‌లో ఇలా మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యాడు. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ.. అంతకుముందు 2012-13లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో కూడా మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగాడు. డిసెంబర్ 2012-జనవరి 2013 మధ్య పాకిస్థాన్ భారత్‌లో పర్యటించినప్పుడు కోహ్లీ ఇలా వరుసగా చెన్నై, కోల్‌కతా, ఢిల్లీలలో జరిగిన మ్యాచ్‌లలో 0, 6, 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఆ చెత్త రికార్డును మళ్లీ రిపీట్ చేశాడు.














Click it and Unblock the Notifications
