టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు కోహ్లీ గైర్హాజరు వెనుక, అసలు కారణం..!!
టీ20 ప్రపంచ కప్ భారత్ సొంతం చేసుకుంది. వరుసగా రెండు సార్లు ప్రపంచ విజేతగా.. మూడు సార్లు కప్ గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఫైనల్ లో ఏకపక్షంగా కివీస్ పైన భారత జట్టు గెలిచిన తీరు పైన ప్రశంసల వర్షం కురిసింది. బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఫైనల్ కోసం మాజీ కెప్టెన్లు ధోనీ.. రోహిత్ శర్మ హాజరయ్యారు. అయితే, విరాట్ కోహ్లీ రాలేదు. విరాట్ రాకపోవటం పైన చర్చ జరిగింది. అయితే, కోహ్లీ గైర్హాజరు వెనుక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో విరాట్ కోహ్లీ కనిపించకపోవటం చర్చగా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కూడా హాజరయ్యారు. అయితే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కనిపించకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. గతంలో కోహ్లీ చెప్పిన మాటలను సోషల్ మీడియాలో ఈ సందర్భంలో గర్తు చేస్తున్నారు. 'ఒకసారి నేను క్రికెట్ నుంచి తప్పుకుంటే.. కొంతకాలం పాటు ఎవ్వరికీ కనిపించను..' అని పేర్కొన్న సందేశాన్ని రీ ట్వీట్ చేస్తున్నారు. కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. అయితే, టీం ఇండియా ఫైనల్ కు చేరటంతో మాజీ క్రికెట్ దిగ్గజాలు అందరూ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు.

కోహ్లీ రాకపోవటం వెనుక.. ఏం జరిగింది
అయితే, కోహ్లీ లండన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్ లో గతంలో టీమిండియాను ఛాంపియన్ గా గెలిపించిన మాజీ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్ శర్మలకు ఈ ఫైనల్‌కు ప్రత్యేక ఆహ్వానం లభించింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను ధోనీ విజేతగా నిలిపితే.. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా మళ్లీ టైటిల్ సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ అధికారిక అతిథులుగా స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్‌ను కెప్టెన్‌గా గెలిపించలేదనే విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.అందుకే ఫైనల్‌కు అధికారిక అతిథిగా రాలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అసలు కోహ్లీకి ఆహ్వానం ఉందా లేదా అనేది చర్చగా మారింది. కోహ్లీ రాకపోయినా... టీమిండియా ఫైనల్ కు చేరటానికి.. గెలవటానికి కీలకమైన పాత్ర పోషించిన ఆటగాళ్లకు మాత్రం అవసరమైన సూచన లు.. సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఛాంపియన్ గా నిలిచిన టీం ఇండియా ను కోహ్లీ అభినందించారు.












Click it and Unblock the Notifications