IPL 2026: ఆర్సీబీని కొహ్లీ ఛార్టర్డ్ విమానం అడిగాడా ? స్వయంగా క్లారిటీ..!
వచ్చే వారాంతంలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 (IPL 2026) లో డిఫెండిగ్ ఛాంపియన్ గా అడుగుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు యాజమాన్యం ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ (virat kohli) పలు డిమాండ్లు పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా లండన్ లో తన కుటుంబాన్ని ఉంచిన కొహ్లీ..ఐపీఎల్ మ్యాచ్ ల మధ్య విరామంలో అక్కడికి వెళ్లి వచ్చేందుకు తనకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కొహ్లీ స్వయంగా నోరువిప్పాడు.
కొహ్లీ తమ ఫ్రాంచైజీ ఆర్సీబీ ముందు రెండు ప్రధాన షరతులు పెట్టినట్లు వార్తలొచ్చాయి. అందులో ఒకటి తన కోసం భారత్, లండన్‌ల మధ్య చార్టర్డ్ విమానాన్ని అందుబాటులో ఉంచడం, రెండవది మ్యాచ్‌ల మధ్య మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజుల విరామం ఉన్నప్పుడల్లా లండన్‌లోని తన కుటుంబాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వడం. వీటిపై దుమారం రేగుతుండటంతో కింగ్ కొహ్లీ స్వయంగా దీనిపై ఇన్ స్టా లో స్పందించాడు.

కొహ్లీ తనపై వచ్చిన ఆరోపణలను ఇన్ స్టాలో పోస్టు చేస్తూ ఓ ఫొటో పెట్టాడు. అలాగే వాటిని తనదైన శైలిలో తేలికపాటి స్పందనతో కొట్టిపారేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కేవలం రెండు నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసి, ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో కొన్ని రోజులుగా కొహ్లీ అభిమానులు ఎదుర్కొంటున్న టెన్షన్ కు అతనే స్వయంగా తెరదించాడు. గతేడాది తొలిసారి ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన కొహ్లీపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ వివాదానికి వెంటనే పుల్ స్టాప్ పెట్టడం ద్వారా కొహ్లీ.. విమర్శల నోళ్లు మూయించాడు.












Click it and Unblock the Notifications