గంభీర్‌కు షాకిస్తూ.. సంచలన ప్రకటన చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌

ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక చేతిలో టీమిండియా దారుణ ఓటమిని చవి చూసింది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేను డ్రా చేసుకున్న భారత జట్టు, తర్వాత రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ల స్పిన్ దాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు పెవిలయన్‌కు క్యూ కట్టారు. రోహిత్, విరాట్ కోహ్లిలు జట్టులో ఉన్నప్పటికి ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయారు. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై శ్రీలంక సిరీస్ నెగ్గగలిగింది.

దీంతో టీమిండియాపై ఇంట బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కోచ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లను మారిస్తే వారు ఎలా పరిస్థితులను అర్థం చేసుకుంటారని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ,టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తాను మూడు ఫార్మాట్లు ఆడాలని అనుకున్నట్లు ప్రకటించాడు.

Want to play for India in all three formats - Suryakumar Yadav

టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న సూర్యను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అతనిపై టీ20 బ్యాటర్‌ అనే ముద్ర పడింది. గౌతమ్‌ గంభీర్‌ సూర్యకుమార్ యాదవ్‌ను కేవలం టీ20లకు పరిమితం చేసి, వన్డేలు, టెస్టులకు దూరంగా ఉంచాలని భావించాడు. గంభీర్ నిర్ణయానికి బీసీసీఐకి కూడా ఓకే చెప్పింది. అందుకే శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. అయినా కూడా సూర్య తాను మూడు ఫార్మాట్లు ఆడాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టాడు.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు సూర్య కెప్టెన్సీలో మూడు టీ20ల సిరీస్ ఆడింది. రోహిత్‌ శర్మ వారుసుడిగా భారత టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్య.. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో టీమిండియా విజయవంతంగా నడిపించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఏకంగా 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేశాడు. ఇప్పుడు వన్డే సిరీస్ ఓడిపోవడంతో తాను వన్డేలు సైతం ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.మరి సూర్య కుమార్ యాదవ్ నిర్ణయం బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+