ఎవడ్రా నువ్వు.. మా రాజుగారికే ఎసరు పెట్టావ్: రూ.30 లక్షలకు 4 వికెట్లు
MI vs KKR: ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు బోణీ కొట్టింది ముంబై ఇండియన్స్. కోల్‌కత నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు వరుస ఓటములకు పుల్ స్టాప్ పడింది. మ్యాచ్ ముందు వరకూ పాయింట్ల పట్టికలో అట్టడుగున.. అంటే పదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా ఆరోస్థానానికి ఎగబాకింది.
116 పరుగులకే..
సోమవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది కోల్‌కత నైట్ రైడర్స్. అధ్వాన్నపు ఆటతీరును ప్రదర్శించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల పరాక్రమం ముందు తలవంచింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో 116 పరుగులకు కుప్పకూలింది.

బ్యాటింగ్ ఆర్డర్ కుదేల్..
కోల్‌కత నైట్ రైడర్స్ ఇన్నింగ్‌లో 26 పరుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ఒక్కడే టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. క్వింటన్ డికాక్- 1, సునీల్ నరైన్- 0, అజింక్య రహానె- 11, వెంకటేష్ అయ్యర్- 3, రింకూ సింగ్- 17, మనీష్ పాండే- 19, ఆండ్రీ రస్సెల్- 5, రమణ్ దీప్ సింగ్- 22, హర్షిత్ రాణా- 4, స్పెన్సర్ జాన్సన్- 1 పరుగు చేశారు.
అలవోకగా..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది. 12.5 ఓవర్లల్లో 121 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఫామ్‌లో లేని ఓపెనర్ రోహిత్ శర్మ 13, విల్ జాక్స్- 16 పరుగులకే అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 62, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టారు.
అశ్విని కుమార్ తడాఖా..
ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగాడు డెబ్యూట్ బౌలర్ అశ్విని కుమార్. మూడు ఓవర్లల్లో 24 పరుగులు ఇచ్చి అజింక్య రహానె, రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ వికెట్లను నేలకూల్చాడు. ఇదే అతనికి తొలి ఐపీఎల్ సీజన్.. తొలి మ్యాచ్ కూడా. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
తుదిజట్టులో..
జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ తొలి రెండు మ్యాచ్‌లోనూ ఆడలేదు అశ్విని కుమార్. ఏపీకి చెందిన పేస్ బౌలర్ సత్యనారాయణ రాజు ఆడాడీ రెండింట్లో కూడా. ఈ గేమ్ కోసం తుదిజట్టులో మార్పులు చేసింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్. సత్యనారాయణ రాజును పక్కనపెట్టింది. అతని స్థానంలో అశ్విని కుమార్‌ను తీసుకుంది.

ఐపీఎల్ తొలి బంతికే..
ఈ మార్పు- ఎలాంటి ఫలితాలను ఇచ్చిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వచ్చాడు అశ్విని కుమార్. తన తొలి ఓవర్‌లోనే కేప్టెన్ అజింక్య రహానెను పెవిలియన్ దారి పట్టించాడు. ఐపీఎల్ కేరీర్‌లో తొలి బంతికే వికెట్ పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
రహానె సహా..
వికెట్లకు దూరంగా వేసిన బంతిని.. డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు భారీ షాట్ ఆడాడు రహానె. అక్కడే ఉన్న తిలక్ వర్మ ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. ఆ తరువాత తన రెండో ఓవర్‌లో బ్యాక్ అండ్ బ్యాక్ వికెట్లు తీశాడు. ఇన్నింగ్ 11వ ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్, ఆో బంతికి మనీష్ పాండేను అవుట్ చేశాడు. మూడో ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
పంజాబ్ నుంచి..
అశ్విని కుమార్ సొంత రాష్ట్రం.. పంజాబ్. ఐపీఎల్ మెగా వేలంపాట సందర్భంగా బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. రంజీల్లో కూడా పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. 2022లో రెండు రంజీ మ్యాచ్‌లు ఆడాడు. అదే ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడింట్లో మెరిశాడు. గత ఏడాది సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications