IPL 2025 Winner: ఐపీఎల్ 2025 విజేత ఎవరంటే ? తాజా అంచనా ఇదే..!
హోరాహోరీగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో తొలి దశ పూర్తి కావడానికి మరో 20 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తి కాగానే ప్లేఆఫ్స్ నిర్వహిస్తారు. లీగ్ దశలో టాప్ 4 జట్లూ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. అయితే ఇంకా ఇన్ని మ్యాచ్ లు మిగిలి ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే జట్లతో పాటు ఫైనల్ కు చేరే జట్లు, వాటిలో విజేతపైనా పలు జోస్యాలు వెలువడుతున్నాయి. పలువులు మాజీ క్రికెటర్లతో పాటు బెట్టింగ్ యాప్స్ కూడా వాటి అంచనాల్ని వెల్లడిస్తున్నాయి.
ప్రముఖ బెట్టింగ్ యాప్ డఫాబెట్ అంచనా ప్రకారం ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉన్న నాలుగు జట్లలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కనిపిస్తున్నాయి. ఏవైనా అద్బుతాలు జరిగితే తప్ప ఈ నాలుగు జట్లూ ప్లే ఆఫ్స్ కు చేరడం ఖాయమని డఫాబెట్ అంచనాలు చెప్తున్నాయి. అయితే ఇందులో ఫైనల్ కు చేరే అవకాశం ఉన్న జట్లపై ఇంకా క్లారిటీ రానప్పటికీ విజేతపై మాత్రం డఫాబెట్ తాజా అంచనాల్ని వెలువరించింది.

దీని ప్రకారం ఈసారి ఐపీఎల్ ఫైనల్ గెలిచి టైటిల్ గెల్చుకునే అవకాశాలు ముంబై ఇండియన్స్ కు ఉన్నట్లు డఫాబెట్ అంచనా వేస్తోంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాతి స్దానాల్లో గుజరాత్, పంజాబ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్దాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చెత్త ప్రదర్శనతో ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిన జట్లు ఢిల్లీ, లక్నో, కోల్ కతా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications