స్టేడియంలో మెరిసిన వెంకటేష్- అందుకే విక్టరీ

చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లల్లో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవెన్ స్మిత్- 46, డేవిడ్ వార్నర్- 41 పరుగులు చేశారు. ఇన్నింగ్ మొత్తానికీ వారిద్దరే టాప్ స్కోరర్లు. మిఛెల్ స్టార్క్- 28, మార్ముస్ లాంబుషెన్- 27, పాట్ కమ్మిన్స్- 15, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 15 పరుగులు చేశారు.

World Cup 2023, IND vs AUS: Actor Venkatesh enjoy match at Chepauk

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ప్రారంభంలో మూడు వికెట్లను కోల్పోయింది. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పరుగులేమీ చేయలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సైతం సున్నాకే వెనుదిరగడం జట్టును ఆందోళనకు గురి చేసింది. ఒక దశలో రెండు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా.

అలాంటి స్థితిలో క్రీజ్‌లో నిలిచిన టీమిండియా బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ధాటిగా ఆడారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపారు. ఎదురుదాడితో అదరగొట్టారు. ఈ క్రమంలో వారిద్దరూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు.

85 పరుగులు చేసిన తరువాత విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ.. పెద్దగా కలవర పడాల్సిన అవసరం రాలేదు. అప్పటికే విజయానికి చేరువైంది భారత్. అప్పటికీ జట్టు స్కోరు167 పరుగులు. క్రీజ్‌లో నిలిచిన కేఎల్ రాహుల్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తోడయ్యాడు. ఇద్దరూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. కేఎల్ రాహుల్- 97, పాండ్యా- 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

కాగా- ఈ మ్యాచ్‌లో విక్టరీ వెంకటేష్ మెరిశారు. స్టాండ్స్‌లో కూర్చుని ప్రత్యక్షంగా ఈ పోరును వీక్షించారు. క్రికెట్ అంటే ఎక్కడికైనా వెళ్లి చూస్తారు వెంకటేష్. ఇదివరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కొన్ని కీలక మ్యాచ్‌లల్లో కనిపించారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ ఫ్యాన్. ఎస్ఆర్‌హెచ్‌ ఆడిన మ్యాచ్‌లను రెగ్యులర్‌గా చూసేవారు. ఇప్పుడు టీమిండియా ఓపెనింగ్ మ్యాచ్ కోసం చెన్నైకీ వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+