World Cup 2023: ప్రపంచ కప్ ముందు భారత్ కు షాక్ - గిల్ దూరం..!!

క్రికెట్ ప్రపంచ కప్ సమరం మొదలైంది. భారత్ తమ తొలి మ్యాచ్ ఆసీస్ తో తల పడేందుకు సిద్దమైంది. ఇప్పటికే టీమిండియా చెన్నై చేరుకుంది. అయితే, తొలి మ్యాచ్ కు ముందు భారీ షాక్ తగిలింది. పూర్తి ఫాం లో ఉన్న ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డారు. పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో, ఆసీస్ తో జరిగే తొలి మ్యాచ్ కు గిల్ ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. మరి..ఈ సమయంలో గిల్ స్థానం భర్తీ చేసేది ఎవరు. ఎవరి వైపు చూస్తున్నారు.

తొలి మ్యాచ్ కు గిల్ డౌట్: ప్రపంచ కప్ సమయంలో భారత్ తమ తొలి మ్యాచ్ ఆసీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా ప్రపంచ కప్ కు శుభారంభం ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ భారీ అంచనాలతో ఉన్నారు. చిదంబరం స్టేడియంలో టికెట్లు పూర్తిగా అయిపోయాయి.

Shubman Gill is down with dengue

ఇక, టీం సభ్యులు గాయాల నుంచి కోలుకొని బయట పడ్డారని భావిస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డాషింగ్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డారు. పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో, ఆసీస్ మ్యాచ్ కు గిల్ కోలుకొనే అవకాశం లేదని సమాచారం. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ తో కలిసి ప్రారంభించే ఛాన్స్ కనిపిస్తోంది.

గిల్ స్థానంలో కిషన్: ఆసీస్ తో మ్యాచ్ కోసం టీమిండియా బుధవారం చెన్నైకు చేరింది. అప్పటి నుంచి గిల్ జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా నిర్దారించాల్సి ఉంది. జ్వరంతో ఉన్నాడని చెబుతున్నా..డెంగ్యూ పైన అధికారికంగా వెల్లడించలేదు. డెంగ్యూ అయితే కోలుకోవటానికి వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

Ishan Kishan

ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆసీస్ తో మ్యాచ్ కు ముందు రోజు మాత్రమే గిల్ ఆడేదీ లేదని స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. తొలి మ్యాచ్ లోనే సత్తా చాటాలని భావిస్తున్న టీమిండియాకు ఇప్పుడు గిల్ అందుబాటులో ఉండదరనేది ఇబ్బందిగా మారుతోంది.

టీమిండియా పై భారీ అంచనాలు: ఈ సారి ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లోనే బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఇంకా 13 ఓవర్లు ఉండగానే చేధించారు. కాన్వే, రచిన్ మెరుపులతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. రెండో మ్యాచ్ లో ఈరోజు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ టీం నెదర్లాడ్స్ తో తల పడనుంది.

ఇక..టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కోట్లాది అభిమానుల సమక్షంలో స్వదేశంలో ఆడుతున్న రోహిత్ సేన ఆదివారం ఆసీస్ తో తొలి మ్యాచ్ కు సిద్దం అవుతోంది. ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోంది. ఇక, గిల్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+