యశస్వి జైస్వాల్ అవుట్- ఆ జట్టుకు గుడ్‌బై: శాశ్వతంగా
Yashasvi Jaiswal: టీమిండియా డాషింగ్ ఓపెనర్, యువ బ్యాటింగ్ సంచలనం యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. తన సొంత జట్టు ముంబైకి గుడ్‌బై చెప్పబోతోన్నాడు. గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నాడు.
2025- 26 సీజన్ ఆరంభంలోనే గోవాకు తరలి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో గోవాకు అతను కేప్టెన్‌గా అపాయింట్ అయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. గోవా తరఫున ఆడటానికి వీలుగా త్వరలోనే ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొంది.

ముంబై తరఫున 2019లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు యశస్వి జైస్వాల్. ఛత్తీస్‌గఢ్‌తో వాంఖెడే స్టేడియంలో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌తోనే ఆకట్టుకున్నాడు. ముంబై తరఫున ఇప్పటివరకు 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను ఆడిన జైస్వాల్.. 3,712 పరుగులు చేశాడు. ఇందులో 12 చొప్పున సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
జాతీయ జట్టులో చోటు లభించిన నేపథ్యంలో రంజీ ట్రోఫీల్లో ముంబై తరఫున యశస్వి జైస్వాల్ పెద్దగా ఆడట్లేదీ మధ్య. ఈ ఏడాది జనవరిలో జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్ చివరిది. ఇందులో తొలి ఇన్నింగ్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్‌లో 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్ ఒక్కటీ నమోదు చేయలేదు. గువాహటిలో చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు. అంతకుముందు కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొన్న మ్యాచ్‌లో 24 బంతుల్లో 29 పరుగుల చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ జైస్వాల్ చేసింది ఒక్క పరుగే.












Click it and Unblock the Notifications