మైదానంలో గుండెపోటుతో మృతిచెందిన యువ పేసర్...
కశ్మీర్‌కు చెందిన ఓ యువ పేసర్ క్రికెట్ మైదానంలో గుండెపోటుతో మృతిచెందాడు. క్రికెటర్‌గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం ముగిసిపోయింది. మైదానంలోనే గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఆ యువ పేసర్ పేరు సుహైబ్ యాసిన్. అతడు జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తి. అతని వయస్సు 20 ఏళ్లు. క్రికెట్‌లో రాణించాలనే అతని కల కలగానే మిగిలిపోయింది. క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే ఆ యువకునికి గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
క్రికెట్‌లో రాణించాలని చాలామంది యువకులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. చిన్నప్పటి నుంచి అందుకు తగిన కృషి చేస్తుంటారు. క్రికెట్ మనదేశంలో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలుసు. చాలామంది యువకులకు ఇది ఒక ఆటగా మాత్రమే కాకుండా ఓ ప్యాషన్‌గా కూడా ఉంది. అందుకే చాలామంది ఈ రంగాన్ని ఎంచుకుంటుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే కశ్మీర్‌కు చెందిన సుహైబ్.

క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ, క్రికెట్ ఆడుతూ మైదానంలోనే ఆ యువపేసర్ గుండెపోటుకు గురై అకాల మరణం పొందాడు. కశ్మీర్‌లోని పట్టాన్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న 20ఏళ్ల సుహైబ్ గుండెపోటుతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్లు సుహైబ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చీకటి నిండిపోయింది.
In the wake of tragedy, Pattan grieves the loss of Suhaib Yaseen, a spirited soul who met an untimely end on the cricket field today. The pain is shared by the entire people of Pattan. My thoughts are with Suhaib's family as they navigate this profound sorrow. May we collectively…
— Imran Reza Ansari (@imranrezaansari) January 26, 2024
ఛాతిలో నొప్పితో కుప్పకూలిన సుహైబ్ : శుక్రవారం నాడు కశ్మీర్‌లోని హంజీవర ప్రాంతంలోని బారాముల్లాలో ఉన్న పట్టాన్‌లో ఎప్పటిలాగే సుహైబ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రనప్ పూర్తి చేసి బంతిని విసిరే సమయంలో సుహైబ్‌కి ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో, అక్కడిక్కడే అమాంతం కిందపడిపోయాడు. అతడలా పడిపోవడం చూసి వెంటనే తోటి ఆటగాళ్లు అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న యాసిన్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఇటు యాసిన్ కుటుంబంలో, అటు పట్టాన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ తమతో కలిసి క్రికెట్ ఆడిన సహచరుడు ఆకస్మాత్తుగా మృతిచెందడంతో తోటి క్రికెటర్లు కన్నీటీ పర్యంతమయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications