యుజ్వేంద్ర చాహల్ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది: రిషబ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న కొన్ని నెలలకే ఆర్జే మహవాష్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు జోరందుకున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూరుస్తూ తాజాగా కపిల్ శర్మ షోలో రిషబ్ పంత్ చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చాహల్, మహవాష్‌ల బంధంపై ఊహాగానాలు
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులు ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది నెలల ముందు ఖరారయ్యాయి. ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఆర్జే మహవాష్ చాహల్ జట్టు పంజాబ్ కింగ్స్‌ను ప్రోత్సహించడానికి స్టేడియంలో కనిపించింది. అంతే కాకుండా చాహల్ కోసం ప్రత్యేకంగా ఒక నోట్ రాస్తూ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. ఇటీవల ఆర్జీ మహవాష్, యుజ్వేంద్ర చాహల్ లండన్‌లో కలిసి కనిపించడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.

కపిల్ శర్మ షోలో రిషబ్ పంత్ హాస్యం
ఇటీవల క్రికెటర్లు రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, అభిషేక్ శర్మ, గౌతమ్ గంభీర్ కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ షూట్‌కు సంబంధించిన తెర వెనుక వీడియోను అర్చనా పూరన్ సింగ్ తన వ్లాగ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో నవజోత్ సింగ్ సిద్ధూ, కపిల్ శర్మ, ఇతర టీంతో క్రికెటర్ల సరదా క్షణాలు ఉన్నాయి. కపిల్ శర్మ షోకు కొత్తగా వచ్చిన అభిషేక్ శర్మను అర్చనా సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆమె అభిషేక్‌ను "చాలా అందమైన అబ్బాయి" అని ప్రశంసించింది. కపిల్, అభిషేక్ ఇద్దరూ అమృత్‌సర్ నుంచే వచ్చారని, అందుకే అతనికి షోలో అవకాశం లభించిందని సరదాగా వ్యాఖ్యానించింది. అర్చనా రిషబ్ పంత్‌ను అతని ఇటీవలి ప్రమాదం గురించి అడిగింది. దానికి రిషబ్ ఆ అనుభవం తనకు "జీవితంపై కొత్త దృక్పథాన్ని" ఇచ్చిందని, చాలా నేర్పిందని చెప్పాడు. తాను ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించానని వెల్లడించాడు. ఈ మాటల మధ్యే, రిషబ్ పంత్ సరదాగా చాహల్ వేలికి ఒక ఉంగరాన్ని పెట్టాడు.
నిశ్చితార్థం, విడాకులపై సరదా చర్చ
రిషబ్ పంత్ చేసిన ఈ పనిపై అర్చన ఆటపట్టిస్తూ.. "ఇప్పుడు నువ్వు అతడిని నిశ్చితార్థం చేసుకున్నావా?" అని అడిగింది. దానికి రిషబ్ పంత్ "అతనికి ఇదివరకే నిశ్చితార్థం అయిపోయింది." అని బదులిచ్చాడు. దీనిపై వెంటనే చాహల్ స్పందిస్తూ.."వెళ్లిపోయింది కూడా" అని నవ్వేశాడు. విడాకులను ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యపై అర్చనా.."ఆ సమయంలో నేను నీ గురించి ఆలోచించాను. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా?" అని అడగగా, చాహల్ "నేను బాగానే ఉన్నాను" అని బదులిచ్చాడు.
ఆ తర్వాత కూడా ఆటపట్టించడం కొనసాగింది. అర్చనా చాహల్‌ను ముంబైలోని తన మాధ్ ఐలాండ్ ఇంటికి ఆహ్వానిస్తూ.. అయితే అతను ముంబైకి రావడానికి చాలా బిజీగా ఉంటాడని జోడించింది. దీనికి రిషబ్ పంత్ జోక్ చేస్తూ "అతను ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు" అని అన్నాడు. చాహల్ బదులిస్తూ, "అందరికీ చెప్పేయ్ నువ్వు (నువ్వు అందరికీ ఎందుకు చెప్పవు?)" అని అనగా, రిషబ్ సెట్‌లో గట్టిగా అరిచాడు. ఈ సరదా జోక్ చాహల్ ఆర్‌జే మహ్వాష్‌తో ఉన్న సంబంధంపై పరోక్షంగా చెప్పినట్లుగా ఉంది. మహవాష్ ముంబైలో నివసిస్తుందని అందరికీ తెలిసిందే. చివరిగా చాహల్ నవ్వుతూ, "ఇది కట్ చేయండి" అని అన్నాడు. ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సంఘటన చాహల్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చకు మరింత ఆసక్తిని జోడించింది. చాహల్, మహవాష్‌ల సంబంధంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానుల్లో ఈ ఉత్సుకత కొనసాగే అవకాశం ఉంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications