వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజర్‌-విచారణకుహాజర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అక్కడ ఒక గంటసేపుగడిపిన అనంతరం హైటైక్‌ సిటీవెళ్ళి సిఐఐ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలోపాల్గొంటారు. క్లింటన్‌ మొత్తంమీద నగరంలో 5 గంటల సేపు వుంటారని అధికారులఅంచనా వేస్తున్నారు.

ఇకపోతే క్లింటన్‌ రాకకు నగరాన్ని ముస్తాబుచేయడంలో ఆధికారులు తలమునకలుగావున్నారు. దాదాపు అన్ని శాఖలు నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు పరుగులు తీస్తున్నాయి.రహదారులన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో ఆలస్యమైతే ఎక్కడ ముఖ్యమంత్రి ఆక్షింతలువేస్తారో అనే భయంతో వాటర్‌ వర్క్స్‌, రోడ్లు భవనాలశాఖ, ట్రాన్స్‌ కో, టెలిఫోన్‌ శాఖల సిబ్బందిఆహర్నిశలు కృషి చేస్తున్నారు. క్లింటన్‌పర్యటించే అవకాశాలున్న మార్గాలను అందంగాతీర్చిదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపడుతున్నారు.

క్లింటన్‌ పర్యటన సందర్భంగా నగరాన్నిముస్తాబు చేసేవ్యవహారంలో అందంగా వున్న రోడ్లనే మళ్లీవేయడం, మరికొన్ని ప్రాంతాలను పూర్తిగా విస్మరించడంవంటి లీలలు జరుగుతున్నాయనే అరోపణలున్నాయి.క్లింటన్‌ సందర్శించే హైటెక్‌ సిటీ అమెరికాప్రతినిథులు, క్లింటన్‌ భద్రతా సిబ్బందితోకోలాహలం గా వుండగా హైటెక్‌ సిటీ గేటుబయట మాత్రం యధావిధిగా పశు సంచారం జరగడంఆధికారుల నిర్వాకానికి నిదర్శనమనే విమర్శలు సైతంవినిపిస్తున్నాయి.

నగరంలో రహదారుల మరమ్మతు, వీధిదీపాలు అమర్చడం, రంగులు వేయడం వంటి పనులకు సుమారు 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుఅధికార వర్గాలు తెలిపాయి. క్లింటన్‌పర్యటించే అవకాశం వున్న మార్గాలే కాకుండాఆయన మంది మార్బలం పర్యటించే మార్గాలను కూడా ఆగమేఘాలమీద ఆందంగా తీర్చి దిద్దుతున్నారు. రోడ్లకూడళ్ళను ఆకర్షణీయంగా అలంకరిస్తున్నారు. ఉద్యానవనశాఖ, నగర పాలకసంస్థ ఆధికారులు ఉమ్మడిగాపర్యవేక్షిస్తున్నారు. క్లింటన్‌ నగరంలో మొదటమహావీర్‌ ఆస్పత్రిని, ఆతరువాత హైటెక్‌ సిటీనిసందర్శిస్తారని భావిస్తున్నారు.

క్లింటన్‌ హైటెక్‌ సిటీ సందర్శనను ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదరిమిలా పంజాగుట్ట నుంచి హైటెక్‌ సిటీవరకు వున్న మార్గాన్ని వందలాది కార్మికులనునియమించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చివరకు రాత్రివేళల్లో కూడా మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు.క్లింటన్‌ పర్యటన పుణ్యమా అని దాదాపు నగరం మొత్తం కళకళలాడుతున్నది.కూడళ్ళలోని ఐలండ్‌ లలో మొక్కలు పెంచేఏర్పాట్లతో పాటు, కూడళ్ళను విద్యుత్‌ దీపాలతోఅలంకరిస్తున్నారు. సోడియం ల్యాంప్‌ ల వెలుగుల్లోనగర రహదారులు తళతళలాడిపోతున్నాయి.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X