వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోహరికథ

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌.టి. రామారావు కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రిచంద్రబాబు బావమరిది నందమూరి హరికృష్ణ చడీ చప్పుడుచేయడం లేదు. రాజకీయాలు నడపడంలేదు, సినిమాల్లోనూ నటించడం లేదు. ఇంతకీఆయనిప్పుడు ఏం చేస్తున్నట్లు? చాలామందినితొలుస్తున్న ప్రశ్న ఇది.

బావ చంద్రబాబుపై అలిగి హరికృష్ణఅన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి వూరూరా తిరిగారు. శాసనసభ, లోకసభఎన్నికల్లో పోటీ చేశారు. తన పార్టీ అభ్యర్థుల్లో ఒకర్ని కూడాగెలిపించుకోలేకపోయారు. పైగా తాను కూడా ఓడిపోయారు. అదేకాలంలో పరిటాల రవి నిర్మించిన శ్రీరాములయ్య చిత్రంలోనే కాకుండామరికొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆయనఅటు సినిమాలను, ఇటు రాజకీయాలను వదిలేసివైరాగ్యంలోకి వెళ్లిపోయారని అనుకున్నారు.

హరికృష్ణ అనుచరులు మాత్రంవేరే కథనాన్ని వినిపిస్తున్నారు. చంద్రబాబునుదెబ్బ తీయడానికి సమయం వస్తుంది. ఆందాకఆగుదాం అని హరికృష్ణ తన అనుచరులకు చెబుతున్నారట.హరికృష్ణ నిజంగా దెబ్బ తిన్న పులి అని ఆయన అభిమానులుఅంటే కాదనడానికి కొంచెం తెగువ కావాలి.రాజకీయాలు సరే, సినిమాల సంగతేమిటి? నటన తండ్రివల్ల అబ్బిన విద్య కాబట్టి దాన్నెట్లా మానేస్తాననిహరికృష్ణ అంటున్నారట. ఆ మధ్య ఓ దర్శకుడుహరికృష్ణతో సినిమా తీస్తానని వచ్చి మళ్లీ తర్వాత కనిపించకుండాపోయాడట. అలా ఎందుకు ఆ దర్శకుడు వెనక్కి తిరిగిపోవాల్సివచ్చిందనే దానికి సమాధానం వెతకడం ఆరోగ్యానికిమంచిది కాదని అంటున్నారు. అయితే, తెగించి రామకృష్ణాహార్టీ కల్చర్‌ స్టూడియోస్‌ (ఇది హరికృష్ణసోదరులదే) స్వయానా పనిగట్టుకుని హరికృష్ణ కోసం ఓకథను తయారు చేస్తుందని వినికిడి. ఈ సినిమానిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.

సినిమా రంగంలో వెన్నంటి వున్న పరిటాలరవి, రాజకీయాల్లో సలహాసంప్రదింపులు ఇచ్చిముందుకు నడిపిస్తానన్న పెద్ద బావ డాక్టర్‌దగ్గుబాటి వేంకటేశ్వర రావు హరికృష్ణను ఇంకాముందుకు(?) నడిపిస్తారో, లేదో వేచి చూడాల్సిందే.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X