తిరుగుటపాలో జెడి
గడ్డం చక్రవర్తి అనబడే జెడిచక్రవర్తి కలిసి వచ్చిన అవకాశాన్ని కాలదన్నేసుకున్నాడు.ఆయనకు అమెరికాలో నిర్మించే ఒక ఆంగ్ల చిత్రంలోనటించే అవకాశం వచ్చింది. ఆయన గొంతెమ్మ కోర్కెలకువిసిగిపోయిన ఆయనను నిర్మాతలు హైదరాబాద్‌కు తిరుగుటపాలో పంపేశారట.
ఔనంటూ..కాదంటూ.. అనే తెలుగు సినిమాను ప్రారంభించిమధ్యలో ఆపేసిన దర్శకుడు చంద్రసిధార్థఅనురాగ్ మాథుర్ నవల ఆధారంగా ఆంగ్లంలో సినిమానుఅమెరికాలో తీసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. జెడిచక్రవర్తిని హీరోగా ఎంపిక చేసుకున్నారు కూడా. ఈ సినిమానునిర్మించ తలపెట్టిన బాస్ ప్రొడక్షన్‌నుచక్రవర్తి యాభై శాతం వాటా అడిగాడట. అందుకు ఆ సంస్థఅంగీకరించలేదు. అయినా ఆయన నటించేందుకుఅంగీకరించి వందిమాగధులతో అమెరికా వెళ్లాడు. వెళ్లనయితే వెళ్లాడు గానీఅన్నీ కొర్రీలే పెట్టాడట. సత్య సినిమా సిడి క్యాసెట్లుతాను పంపానని, ఆ సినిమాలో తనను నటననుచూసి బాస్ ప్రొడక్షన్స్ తనను హీరోగా ఎంపికచేసుకుందని ప్రచారం చేసుకుంటూసిదార్థచంద్ర, షూటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఆయనసోదరుడిని చక్రవర్తి మర్చిపోవడమే కాకుండా దర్శకుడుసిధార్థచంద్రకు ఎసరు పెట్టడానికి కూడావెనుకాడలేదట. హీరోకివ్వాల్సిన గౌరవంఇవ్వడం లేదని, దర్శకుడ్ని మార్చాలని ఆయన నిర్మాతలనుపట్టుబట్టాడట. దాంతో విసిగిపోయిన నిర్మాతలుఆయనను వెనక్కి పంపించేశారట. చక్రవర్తిస్థానంలో స్థానిక భారతీయుడిని హీరోగా ఎంపిక చేసుకునివారు సినిమా షూటింగ్ సాగించారని తెలుస్తోంది.
ఈ విషయాన్ని దాచడానికి చక్రవర్తికథ అల్లి చెబుతున్నారని తెలుగుసినీరంగంలో ప్రచారం జరుగుతోంది. మూడు నెలలముందు వెళ్లే గానీ అమెరికాలో అనుమతి ఇవ్వరని,అందువల్ల తాను తిరిగి వచ్చానని చక్రవర్తిచెబుకుంటున్నాడట. అంతేకాకుండా ఇకముందుతాను కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వనని ప్రతిజ్ఞ కూడాచేశారట.












Click it and Unblock the Notifications
