హైదరాబాద్: ఉప ఎన్నికలుముగియడంతో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపైఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇంటాబయటాసమస్యలతో సతమవుతున్న ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు వాటికి విరుగుడు మంత్రివర్గవిస్తరణేనని భావిస్తున్నట్లు వినికిడి. విద్యుత్ ఛార్జీలపెంపుతో ప్రతిపక్షాలు బయటి నుంచి ముఖ్యమంత్రినిఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేసమయంలో ఇంటిపోరు రచ్చకెక్కే వాతావరణంఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోమంత్రిపదవులు దక్కక లోలోపల కుమిలిపోతున్నసీనియర్లకు విద్యుత్ చార్జీల పెంపు పేరుతో చంద్రబాబుపై కుంపటి రాజేసేఅవకాశం చిక్కింది. ఇప్పటికే డిప్యూటి స్పీకర్‌కె. చంద్రశేఖరరావు చంద్రబాబుకు బహిరంగ లేఖరాయడం తలనొప్పిగా పరిణమించింది. మరో మాజీ మంత్రిబి. గోపాలకృష్ణారెడ్డి కూడా గొంతు విప్పారు. వారికి తోడు శాసనసభ్యులుమరికొందరు గళాలు విప్పుతారేమోననే ఆందోళనతెలుగుదేశం వర్గాల్లో స్పష్టంగాకనిపిస్తోంది.
హీరో కృష్ణకు ష్యూస్ మీద ఎనలేని ప్రీతి అనిఆయన అభిమానులు చెప్పుకుంటుంటారు. తెలుగుసినిమాల్లో ఒక పాట చిత్రీకరణకే హీరోహీరోయిన్లడ్రెస్‌లు డజన్ల కొద్ది మార్చిన సంఘటనలువున్నాయి. అట్లాగే, హీరో కృష్ణ ఒక్కసారి వేసుకున్న బూట్లుమరోసారి వేసుకోరట. అదలా వుంచితే, తాను రకరకాల బూట్లనువేసుకోవడమే కాకుండా వాటిని చాలా జాగ్రత్తగాభద్రపరిచే అలవాటు కృష్ణకు వున్నదని వినికిడి. కృష్ణవేసుకన్న బూట్లు వందలకొద్దీ వుంటాయంటారు.వాటినన్నింటినీ ఒక గదిలో భద్రంగా వుంచారనిఅంటారు. వీటితో ఒక ఎగ్జిబిషన్ పెట్టవచ్చునని ఒకతను సరదాగా కామెంట్ చేశాడు.












Click it and Unblock the Notifications
