జూన్‌ లో రిటైరవుతాను : ఖుష్భూ

ఈ మధ్యే పెళ్ళిచేసుకున్న ఖుష్భూ ఇక సినిమాలకు టాటాచెప్పేస్తానంటోంది. సాధారణ గృహిణిగానే ఉండడం ఇష్టమంటోన్న తమిళ పొణ్ణుతో ఇండియా ఇన్ఫోఇంటర్వ్యూ.

లేతప్రాయంలోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఖుష్భూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డారు. కెరీర్‌ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఖుష్భూబాలీవుడు నుంచి మద్రాస్‌ కు వచ్చి తమిళసినిమాల్లో స్థిరపడ్డారు. ముద్దుగా, బొద్దుగా, ఎర్రగా ఉండే అమ్మాయిలంటే ఇష్టపడే తమిళులకు ఖుష్భూఆరాధ్యదైవమయ్యారు. కొంతమందివీరాభిమానులు ఏకంగా గుడినే కట్టేశారు. కొన్నాళ్ళు హీరో ప్రభుతోప్రేమాయణం సాగించిన ఖుష్భూ - అది కాస్తా బెడిసికొట్టడంతో ఇప్పుడు తమిళ దర్శకుడు సుందర్‌ తో వివాహం చేసుకొని తనపై వస్తోన్న రూమర్స్‌ కు ఫుల్‌ స్టాప్‌పెట్టారు. జూన్‌ లో సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తానంటున్న ఈ కొత్తపెళ్ళికూతురుతోఇండియాఇన్ఫో మాటామంతి.

ప్ర:ఎందుకింత హడావిడిగా పెళ్ళి చేసుకున్నారు ?

జ: ఇందులో హడావిడి ఏముంది. మేం ఎప్పట్నుంచో పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. మేమిద్దరం ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. కాకపోతే, మధ్యలో ఇద్దరికీ విభేదాలు తలెత్తిన మాట నిజం. ఇవి బయటికి పొక్కిన మాట వాస్తవమే. సుందర్‌ కి కొద్దిగా షార్ట్‌ టెంపర్‌. మా మధ్య సంబంధం ముగిసిందని, మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమేనని కూడా సుందర్‌ ప్రకటించాడు. వారం రోజుల తర్వాత సినిమా షూటింగ్‌ లో తిరిగి అతనే పలకరించాడు. తెల్లారితనే వచ్చి పెళ్ళి చేసుకుందామా అని అడిగాడు. వెంటనేచేసుకోవాలనుకున్నాం. చేసుకున్నాం.

ప్ర: కానీ జూన్‌ లో చేసుకుంటామని ఇంతకుముందు ప్రకటించారు కదా?

జ: అలా ఎప్పుడూ చెప్పలేదు. నేను ఒప్పుకున్న చిత్రాలు జూన్‌ వరకు పూర్తవుతాయి. అంతవరకుఆగాలనుకున్నా, తర్వాత నిర్ణయం మార్చుకున్నాం.

ప్ర: పెళ్ళయాక నటించకపోవడానికి మీ భర్తే కారణమా?

జ: చూడండి. నేను 22 ఏళ్ళుగా నటిస్తున్నాను. ఇంకా నటించడం అవసరమా అనిమా ఆయన అడిగారు. నిజమే! మా వారు సంపాదిస్తున్నప్పుడునేను ఎందుకు కష్టపడడం.

ప్ర: సినిమా తళుకు, బెళుకులకు దూరంగా ఉండగలరా?

జ: కొంచమే కష్టమే. చిన్నప్పట్నుంచి నటిస్తూ వస్తున్నాను కాబట్టి ఆ వాతావారణానికి దూరంగా ఉండలేం. కానీ తప్పదు. ప్రశాంతమైన, ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను.

ప్ర: ముస్లిం యువతైన మీరు ఒక హిందూ కుటుంబంలో సర్దుకుపోగలరా?

జ: నాకు అటువంటి ఇబ్బందేమీ లేదు. మానసికంగా మేమిద్దరం ఏనాడో ఒకటయ్యాం. ఇప్పుడు నేను సుందర్‌ ఇంట్లో ఉండడంఒక్కటే పెళ్ళి వల్ల వచ్చిన తేడా. ఆచారాలు,సంప్రదాయాల విషయాల్లో కూడా మాకు ఎటువంటి పట్టింపులు లేవు. మా అత్తగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కనీసం ఇంట్లో చిన్న, చిన్న పనులు కూడాచేయనివ్వరు.

ప్ర: పిల్లల ఆలోచన ఏమైనా ఉందా?

జ: దానికి ఇప్పుడే తొందరలేదు. కొన్నాళ్ళు హాయిగా ఎంజాయి చేయాలనుకుంటున్నాం.

ప్ర: ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు?

జ: ఇద్దరు. ఒక అమ్మాయి. ఒక అబ్బాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+