ఫిక్సింగ్‌లో అజర్‌తో పాటు బిజలానీ

హైదరాబాద్‌ః అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కు స్వాగతం పలికేబిల్‌ బోర్డులను బ్యానర్లను, స్వాగత ద్వారాలను ఎవరుడిజైన్‌ చేశారో తెలుసా? సాక్షాత్తు అలేక్‌ పదమ్‌సీ. వీటిని క్లింటన్‌ బేగంపేట విమానాశ్రయంనుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే మార్గంలో ఏర్పాటుచేస్తారు. మొత్తం నాలుగు పుష్పాలంకృత స్వాగతద్వారాలను క్లింటన్‌ కోసం ఏర్పాటు చేస్తున్నారు.ఇందులో ఒకటి విమానాశ్రయం వద్ద, మరోటిహైటెక్‌ సిటీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఎ షార్ట్‌ జర్నీఫ్రమ్‌ సిలికాన్‌ వ్యాలీ టు సైబరాబాద్‌,థాంక్యూ, మిస్టర్‌ ప్రెసిడెంట్‌, టుగెదర్‌ వుయ్‌ హ్యావ్‌ మేడ్‌ ఇట్‌హ్యాపెన్‌ వంటి నినాదాలు స్వాగతతోరణాలనుఅలంకరిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధి పొందినచార్మినార్‌ వంటి చిహ్నాలు కూడా వాటి మీద కొట్టొచ్చినట్లుకనిపిస్తాయి.

కాగా, క్లింటన్‌కు ఏది ఇష్టమో కనుక్కునిఅందుకు అనుగుణంగా స్వాగత సత్కారాలకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. క్లింటన్‌ పసుపురంగు గులాబీలు ఇష్టమని తెలుసుకునివాటి స్వాగత తోరణాల అలంకరణకు ఎక్కువగావాడినట్లు తెలుస్తోంది.

రంగురంగుల క్లింటన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు కటౌట్లను పెట్టడానికి కూడా రాష్ట్రయంత్రాంగం హడావిడి పడుతోంది. ఇవి 20 అడుగుల ఎత్తు, 12అడుగుల వెడల్పు వుంటాయి.

ఇదిలావుంటే, క్లింటన్‌ హైదరాబాద్‌సందర్శన సందర్భంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీఎడ్యుకేషన్‌, ఇమేజింగ్‌లలో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పరస్పరసహకారానికి కొత్త ద్వారాలు తెరుచుకోవచ్చు.ఎన్ని, ఏ రకమైన ఒప్పందాల మీద సంతకాలుజరుగవచ్చుననేది ప్రోటోకాల్‌ దృష్ట్యా వెల్లడించడంసాధ్యం కాదని ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కార్యదర్శిసత్యనారాయణ అంటూ ఐటి ఎడ్యుకేషన్‌, ఇమేజింగ్‌లకు ప్రముఖ స్థానం లభిస్తుందనిచెప్పారు. హైదరాబాద్‌ ఇప్పటికే ప్రపంచఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చిత్రపటం మీద చోటుచేసుకుంది.క్లింటన్‌ పర్యటన ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా స్థానిక పరిశ్రమకుప్రోత్సాహం అందిస్తుందని సత్యనారాయణ అన్నారు.అమెరికా ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ఏజెన్సీ మద్దతుతో అమెరికా ఎనర్జీ అసోసియేషన్‌, రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐసంయుక్తంగా నెలకొల్పిన ఇండో-అమెరికా గ్రీన్‌బిజినెస్‌ సెంటర్‌ను క్లింటన్‌ హైటెక్‌సిటీలో ప్రారంభిస్తారు. ఇంధన సామర్థ్యంలో, పర్యావరణ ప్రభావాల్లో అంతర్జాతీయ ప్రమాణాలస్థాయిలో క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీస్‌ను, గ్రీన్‌బిజినెస్‌ ప్రాసెస్‌ను, బెంచ్‌మార్క్‌ ఇండియన్‌ ఫర్మ్‌లనుప్రోత్సహించడానికి ఈ సెంటర్‌ పనిచేస్తుందనిఅధికార వర్గాలు చెప్పాయి.

హైటెక్‌ సిటీలో క్లింటన్‌ ప్రముఖపారిశ్రామికవేత్తలను ఉద్దేశించి 20 నిమిషాల ప్రసంగంచేస్తారు. దానికి ముందు ఆయన ఎయిర్‌ కండీషన్‌హాల్‌లో పేరు మోసిన పరిశ్రమలు ఏర్పాటు చేసే నాలెడ్జ్‌ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఈ హాల్‌లో 1,200మంది మాత్రమే పడుతారు. ఈ ప్రదర్శనలో సత్యంఇన్ఫోవే, ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌, కంపాక్‌, డాక్టర్‌ రెడ్డీల్యాబ్స్‌, గ్లోబల్‌ ట్రస్టు బ్యాంక్‌, మ్యానుఫాక్చరర్స్‌అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ,మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌, ఒరాకిల్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, టాటా సెల్యులార్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపాల్గొంటాయి.

క్లింటన్‌ పర్యటన వల్ల ఐటిఒక్కటే కాకుండా మిగతా రంగాలు కూడా లబ్ధి పొందుతాయని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు ఆశిస్తున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వ్యవసాయాధారితపరిశ్రమలు, ఆటోమొబైల్‌ విడి భాగాల పరిశ్రమలనుపరస్సర సహకారానికి అనువైనవిగా గుర్తించినట్లుపరిశ్రమల, వాణిజ్య ముఖ్య కార్యదర్శి టి. గోపాల రావుచెప్పారు.

కాగా, క్లింటన్‌ వెళ్లే రహదారి గుండారెండురోజులుగా విస్తృతంగా ట్రయల్స్‌ జరుగుతున్నాయి.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల ప్రభావంనగర ప్రజల దైనందిన కార్యకలాపాలపైపడబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+