వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదహారేళ్లవయస్సు సినిమాతోనే యువకులను వెర్రిత్తించిన శ్రీదేవి గ్లామర్టాలీవుడ్కే పరిమితం కాలేదు.బాలీవుడ్‌ను కూడా వూపేసి మాధురీదీక్షిత్తోనెంబర్ వన్ కోసం పోటీ పడిన అందాల తార శ్రీదేవి ఈమధ్యకాలంలో తెర వెనుకే వుండిపోయింది. ఆమె తిరిగి సినిమా రంగ ప్రవేశంచేస్తుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.సుభాష్ ఘాయ్ యాదే సినిమాలోను, యాష్‌చోప్రా మొహబ్బతే సినిమాలోను శ్రీదేవినటిస్తుందనే వార్తలు గాలిలో గిరికీలుకొట్టాయి.
తెలుగులోహిట్ అయిన అంతఃపురం సినిమాను బోనీ కపూర్హిందీలో నిర్మించాలని తలపెట్టినట్లు, ఆసినిమాలో శ్రీదేవి నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. . పొగ లేకుండావార్తలు రావని సామెత. అయితే, పెళ్లి చేసుకుని ఇల్లుచూసుకుని చల్లగ కాపురముండాలనే పాత తెలుగు పాటను స్మరించుకుంటూ వుండడానికే శ్రీదేవి కట్టుబడివుందట. తన కూతురు జాహ్నవిని చూసుకుంటూఇంట్లోనే వుండిపోదామని ఆమె అనుకుంటున్నట్లువార్తలు వెలువడ్డాయి. కొంత కాలం ఆగితే గానీఊహాగానాలకు గల బలమేమిటో అర్థం కాదనేవాళ్లున్నారు కూడా.
-
బ్రహ్మానంద మాయ
Story first published: Thursday, April 27, 2000, 23:25 [IST]