ఈ జీవిని ఎక్కడోచూసినట్టుందా?

ఇతనిపేరు సుధాకర్‌ అలియాస్‌ జీవి. అంతః పురంసినిమాలో విలన్‌ పాత్రను పోషించిన ఇతను విలన్‌ గా నటించడంకంటే జీవించడం వల్ల ఎక్కువ గిట్టుబాటుఅవుతుందనుకుని మాఫియా నాయకుడి అవతారమెత్తాడని ఆ మధ్య తెలుగు సినీ రంగమేకాదు, సినీ పరిజ్ఞానం ఎంతో కొంత వున్న ప్రతి ఒక్కరూఅనుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. గత ఏడాదినగరానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్తను నగరదక్షిణ శివారులోని షాద్‌ నగర్‌ వద్ద కిడ్నాప్‌ చేసి

తన ఫాం హౌస్‌ లో నిర్భందించాడనే ఆరోపణమీద ఈ పెద్ద మనిషి పోలీసుల చేతికి చిక్కి పత్రికల పతాక శీర్షికలకెక్కాడు.

ఓ అగ్ర దర్శకుడి అండ దండలు (ఆ అగ్రదర్శకుడుజీవితో తనకేమీ సంబంధం లేదని, తనవద్దకు కొన్ని వందలమంది వస్తుంటారని,అందులో ఇతనొకడు కావచ్చునని అన్న విషయంబహుశా ఎవరూ మరచిపోయి వుండరు), ఓ మాజీ పోలీసుడైరెక్టర్‌ జనరల్‌ ఆశీస్సులు ఉన్నాయనిఇంటరాగేషన్‌ లో కూడా ఒప్పుకున్న ఈయన గారుఅమ్మాయిల బ్లాక్‌ మెయిలింగ్‌, బ్లూ ఫిల్మ్‌ ల చిత్రీకరణవంటి కేసులను కూడా ఎదుర్కొంటున్నాడు.ఇన్నిభయంకరమైన కేసుల్లో ఉన్నా మొక్కవోనిస్ధైర్యంతో, భగవద్గీత స్ఫూర్తితో ఈ కారణజన్ముడు బెయిలుమీద విడుదలై నటుడిగా, ఫిల్మ్‌ ఫైనాన్సియర్‌ గాఉగాది నాడుసరికొత్త అవతారమెత్తాడు.

రాష్ట్రవ్యాప్తంగా మూడు వందల సైబర్‌కేఫ్‌ లు పెడతానని సినిమా పత్రికల్లో ప్రకటన ఇచ్చిన సుధాకర్‌ నాయుడు ఓ అగ్రకథానాయకుడితో సినిమా నిర్మిస్తానని కూడా ప్రకటించాడు. పోలీసులుసకాలంలో పట్టుకోక పోయి ఉంటే బాలివుడ్‌ తరహామాఫియా సామ్రాజ్యాన్ని స్ధాపించేవాడని ఆనాడువ్యాఖ్యానించిన సినీ పండితులు ఇప్పుడు తమదైన లౌక్యాన్నిప్రదర్శిస్తున్నారు.

కొసమెరుపుః సుధాకరనాయుడు తండ్రి సి.బి.ఐలో ఉన్నతోద్యోగిగా పనిచేసి రిటైరయ్యాడు. సుధాకర్‌సోదరులు చేసిన సమస్త నేరాల వెనుకఈయన హస్తం ఉందని అనుమానించిన పోలీసులుఅప్పట్లో ఆయన మీద కూడా కేసులు నమోదుచేశారు. మాఫియా నడిపి మరింత సంపాదించవలసిన సుపుత్రుడు నిర్మాతగామారి చెడి పోతున్నాడని ఈవయసులో ఆయన తెగ బాపడిపోతున్నాడట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+