వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ సాయుధదళాలు వెనక్కి?

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూటే వేరు. ఎన్‌.టి.రామారావు పెద్దల్లుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సినిమాల్లో నటించి మామ లాగా ఇమేజ్‌ పెంచుకుందామని ప్రయత్నించి తిరుగు ముఖం పట్టారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి, పని చేసే ముఖ్యమంత్రిగా అనిపించుకుని ప్రజాదరణ పొందాలని శ్రమదానం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు కూడా సినిమాలే మరింత ఇమేజ్‌ను తెచ్చిపెడుతాయని భావిస్తున్నట్లున్నారు.

అయితే, మామ ఎన్టీఆర్‌ లాగా తెరపై కనిపించి కాకుండా తననే ఒక హీరోగా తీర్చిదిద్ది సినిమా తీయించడం ద్వారా ప్రజల గుండెల్లో తిరుగులేని నాయకుడుగా స్థిరపడిపోవడానికి ప్లాన్‌ చేశారట! చంద్రబాబు విధానాలు, కార్యక్రమాలు, ఆకస్మిక తనిఖీలు, రోజుకు 18 గంటల శ్రమ వంటివి వస్తువుగా తీసుకుని సినిమా ఒకటి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చినరాయుడు వంటి సినిమాల్లో గ్రామపెద్దగా నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వెంకటేష్‌ చంద్రబాబుగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంతకీ, సినిమా టైటిల్‌ ఏమనుకుంటున్నారు; మా బాబు. వెంకటేష్‌ తండ్రి డి. రామానాయుడు పేరు మోసిన నిర్మాత. అంతేకాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కూడా. చంద్రబాబు ఆశయాలను, ఆకాంక్షలను తెరపైకి ఎక్కించే సినిమాలో నటించడానికి వెంకటేష్‌ కాల్షీట్స్‌ ఎందుకివ్వరు? మంచి డైరెక్టర్‌ కోసం వెతుకుతున్నారట.

పొలిటికల్‌ డైలాగ్స్‌కు మసాల వేసి వెంకటేష్‌ చేత చెప్పించి ప్రేక్షకుల చేత అయ్యారే అనిపించగల దర్శకుడయితే మంచిదని చూస్తున్నారు. కృష్ణవంశీ పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు వినికిడి. వెంకటేష్‌ సరసన కథానాయిక ఎవరనే సందేహం పుట్టడం సహజం. తెలుగు సినిమారంగం అందాలరాశి సౌందర్య హీరోయిన్‌గా నటిస్తుందని అంటున్నారు.

చంద్రబాబు మంత్రి వర్గ సహచరుడు ఎన్‌. శివప్రసాద్‌కు సినిమా నిర్మాణంలో బోలెడంత అనుభవం వుంది. నటీనటులు, స్క్రిప్ట్‌, అన్నీ సిద్ధంగా వుంటే ఒక నెలలో సినిమా తీసేయగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారట.

మొత్తానికి మా బాబు సినిమా నిర్మాణానికి ప్రేరణ అర్జున్‌ నటించిన ఒకే ఒక్కడు సినిమానట. జర్నలిస్టు అయిన అర్జున్‌ ముఖ్యమంత్రి అయి ప్రజారంజక నిర్ణయాలు చేసి ప్రజల మనిషి అవుతాడు ఈ సినిమాలో. ఇందులో చంద్రబాబు కార్యక్రమాలను, విధానాలను వాడుకున్నారని అంటారు. అటువంటప్పుడు ప్రజల మనిషి అయిన చంద్రబాబు ప్రజారంజక పాలననే సెల్యూలాయిడ్‌పైకి ఎక్కిస్తే ఏమిటని ఈ సినిమాకు శ్రీకారం చుట్టినట్లు అనిపిస్తోంది. ఇప్పడీ సినిమా అవసరమేమిటి? పంచాయతీరాజ్‌ ఎన్నికల కోసం ఈ సినిమాను తీస్తున్నారని ప్రచారం. కరెంట్‌ కోత వల్ల రైతాంగంలో ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మా బాబు సినిమా ఉత్ప్రేరకంగా పని చేస్తుందని అనుకుంటున్నారట.

అనుభవజ్ఞులైన స్క్రిప్ట్‌ రచయితల కోసం దివిటీలు పెట్టి వెతుకున్నారట. ఈ చిత్ర నిర్మాణానికి తెలుగుదేశం నాయకులు, వారి బంధువులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారని వినికిడి. ఈ నెలాఖరుకు సినిమాను తీయడానికి అన్ని హంగులూ సమకూర్చుకుంటారని వినికిడి. దీని ముహూర్తానికి క్లాప్‌ కొట్టేదెవరని అనుమానం వస్తోందా? అనుమానం ఏమీ అక్కర్లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ముహూర్తానికి క్లాప్‌ కొడుతారు.

గత సంచికలో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X