అగ్ర నరసింహుడు

Posted By:
Subscribe to Oneindia Telugu
లంచగొండితనంపై ప్రభుత్వం మెతకవైఖరి అడుగడునా కన్పిస్తున్నది. ఏదైనా దారుణమో,ఉపద్రవమో జరిగితే గానీ అధికారులపై ప్రభుత్వంచర్యలు తీసుకోవడం లేదు. విషజ్వరాలసమయంలోనూ అంతే, స్కాలర్‌ షిప్పుల కుంభకోణంసందర్భంలోనూ అంతే. పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటకరాష్ట్రాల్లో అవినీతి, లంచగొండితనం ఇంత దారుణస్ధాయిలో లేవు. ప్రభుత్వం యంత్రాంగంలో అవినీతి వెర్రితలలువేయకుండా ఆయా రాష్ట్రాల్లో అధికారం చలాయించినఅన్ని పార్టీల నాయకులు చిత్తశుద్ధితో ప్రయత్నించడమేదీనికి కారణం.

రాష్ట్ర హౌసింగ్‌బోర్డులో చీఫ్‌ ఇంజినీర్‌ గా చాలా ఏళ్ళ క్రితం పనిచేసినబహదూర్‌ అవినీతి కథను వింటే రాష్ట్రంలో లంచాలుస్ధాయిలో నడుస్తున్నాయో తెలుస్తుంది. చాలాకాలం నిజాయితీగా పనిచేసినఆయనకు చీఫ్‌ ఇంజినీర్‌ కాగానే తాను సిన్సియర్‌గా ఉంటూ తప్పుచేస్తున్నాననే ఆలోచన వచ్చింది. అవి కుకట్‌ పలహౌసింగ్‌ బోర్డు కాలనీ నిర్మాణపు పనులు జరుగుతున్నరోజులు. కాంట్రాక్టర్ల నుంచి చకచకా లంచాలువసూలు చేసిన ఆయన ఆ కరెన్సీ నోట్లనులాకర్లలో భద్రపరుచుకున్నాడు. యాభై లక్షలకుపైగా ఉంటుందని భావిస్తున్న ఆ నగదుకు, విలువైన ఆస్తులనుపేర్వారం రాములు అవినీతి నిరోధక శాఖ డిజిగా ఉన్నప్పుడుస్వాధీనం చేసుకున్నారు.

పదిహేనేళ్ళలో ఆ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ లాకర్‌ ను ఒక్కసారి కూడా తెరచిచూడలేదు. ఎసిబిస్వాధీనం చేసుకున్న సమయంలో కరెన్సీనోట్లు బూడిదలా మారిపోయిఉన్నాయి.

డబ్బు మీదకసితోనే తాను అవినీతికి పాల్పడి డబ్బుకులాకర్లలో బందీగా చేశానని ఆయన ఎసిబిఅధికారుల ఇంటరాగేషన్‌ లో చెప్పాడు.ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆయనను పోలీసులు తిరిగిఅరెస్టు చేశారు. బహదూర్‌ లా అక్రమ సంపాదననులాకర్లలో పెట్టి పాడు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ.ఆయన ఓల్డ్‌ టైమర్‌. ఈ తరం అవినీతి పరులైనఅధికారులకు లంచాల డబ్బును ఎక్కడ దాచుకోవాలో ఎలాదాచుకోవాలో బాగా తెలుసు. సాంఘిక సంక్షేమశాఖలో ఒక చిన్న అధికారి రెండు కోట్ల రూపాయలుఅక్రమంగా సంపాదించినట్టు ఈ మధ్య వెలుగులోకివచ్చింది.

ప్రతి జిల్లా ఎక్సైజ్‌సూపరింటెండెంట్‌ కు నెలకు ఐదు లక్షలరూపాయల మామూళ్ళు అడగకుండా వస్తాయని,దాడులు వంటివి చేస్తే మరో ఐదు లక్షలు వస్తాయనిమద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు.

సచివాలయంలో భవననిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చినప్పుడుపట్టణాల్లో గ్రామాల్లో అవినీతి స్ధాయిలో ఉందో ఊహించవచ్చు.ఎన్నికల్లో లంచం తీసుకుని ఓటు వేస్తున్న సామాన్యుడేపెద్ద అవినీతి పరుడని, అటువంటి ప్రజలకురాజకీయ నాయకుల, అధికారుల అవినీతినిప్రశ్నించే నైతిక హక్కులేదని రాయలసీమకుచెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు జనాంతికంగావ్యాఖ్యానించారు.

 Recent Stories

  • తెలుగు తమ్ముళ్ళటెన్షన్‌
  • ఇక కండ్ల కలక
  • ఆస్పత్రిలోలియాండర్‌
  • మార్స్‌ఫాస్ట్‌
  • పెద్దల సభకుపెద్దాయన
  • సమైక్యాంధ్ర కోసం
  • టిడిపిబాటలో...
  • పల్స్‌ పోలింగ్‌!
  • వైఎస్‌ కు సమాంతరం?
  • టిడిపి ఆశాభావం

Archives

హోమ్‌ పేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి