• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్తకళ! ఏమిటా కథ?

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Thursday, May 06 2004

;?

Chandrababu Naiduహైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడిలో గత రెండురోజులుగా ఆత్మవిశ్వాసంతొణికిసలాడుతోంది. లెక్కల జోలికి పోదలుచుకోలేదు.తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయనతనను కలిసిన నాయకులకు చెబుతున్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌తోఢీలా పడిన టి డిపి నాయకుల్లో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి.పార్లమెంటు సీట్లు తగ్గవచ్చు కానీ అసెంబ్లీలో మా పార్టీకేఅధిక సీట్లు వస్తాయి అని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నతెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకుడుకె.ఎర్రన్నాయుడు దట్స్‌ తెలుగు డాట్‌కాంకు చెప్పారు.

అధికారంలోకి వచ్చినా రాకపోయినాపార్టీని ప్రక్షాళించాలని చంద్రబాబు నాయుడు గట్టి నిర్ణయానికివచ్చారు. హేమచంద్రప్రసాద్‌ అనే మాజీ ఐఎఎస్‌ అధికారిని పార్టీవ్యవహారాల ఇంచార్జిగా నియమించాలన్నది ఆయన తీసుకున్నముఖ్యమైన నిర్ణయం. హేమచంద్రప్రసాద్‌ ఎన్టీఆర్‌ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కార్యదర్శిగా పనిచేశారు.

దేవేందర్‌ గౌడ్‌, ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు వంటి వారి మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహంతోఉన్నట్టు ఆయన ఆంతరంగికుల కథనం. సంపాదన మీద తప్ప పార్టీ శ్రేయస్సు మీద శ్రద్ధలేనినాయకుల ప్రాధాన్యం తగ్గించడానికి కసరత్తుజరుగుతున్నట్టు తెలుస్తోంది.

తొమ్మిదేళ్ళు అధికారంలో ఉండడంవల్ల సహజంగా తలెత్తే ప్రభుత్వ వ్యతిరేక భావనలకువిరుగుడుగా మంచి వ్యూహం రచించమని తాను చెబితే కొందరుసీనియర్‌ నాయకులు ప్రభుత్వ వ్యతిరేకతే లేదని తననునమ్మించినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడుమధనపడుతున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకేఅవకాశాలున్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగానమ్మడానికి కారణాలివి

 • ఎగ్జిట్‌పోల్స్‌ శాంపిల్స్‌ ఎక్కువగాపట్టణప్రాంతాల్లో తీసుకున్నారు. ఇవి గ్రామీణ ప్రజల తీర్పును పూర్తిగాప్రతిబింబించవు.

 • ప్రభుత్వ వ్యతిరేకత మీడియారాస్తున్నంత ఎక్కువగా లేదు

 • ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితుల్లోకాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ పార్టీకిసహజంగా ఉండే బలహీనతలే అందుకు కారణం. అప్పుడుతెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.

 • ఒకవేళ వైఎస్‌ను కాకుండామరొకరిని ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర సంక్షోభంఏర్పడుతుంది. అప్పుటి పరిస్ధితిని తెలుగుదేశం పార్టీ తనకుఅనుకూలంగా మార్చుకోగలుగుతుంది.

 • పార్టీ శ్రేణులు ఢీలా పడిపోకుండా ఉండేందుకేచంద్రబాబు నాయుడు గాంభీర్యం ప్రకటిస్తున్నారని, ఈసారిప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎంత ప్రచండంగా వీచాయోఆయనకు తెలుసని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు.

  • చంద్రబాబుముభావం
  • బాబుపైమహారథి బాణం
  • ఏంప్లాను బాబో
  • సైకిల్‌కు అసమ్మతి బ్రేక్‌లు
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X