వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిరహస్య ఎజెండా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Tuesday, March 30 2004 ;?
చిరంజీవిరాజకీయాల విషయం ఇప్పుడు నథింగ్‌ అఫీషియల్‌.ఆయన బహిరంగసభల్లో ప్రసంగిచకపోయినాతెలుగుదేశం పార్టీ తరఫున పరోక్షప్రచారం చేయడానికి రంగం సిద్ధమైంది.తెలుగుదేశం పోస్టర్లలో చిరంజీవి కన్పిస్తారు.ఆ పార్టీకి ఓటేయవలసిందిగా పత్రికాప్రకటనలుఇస్తారు. టీవీ ప్రకటనల్లో కన్పిస్తారు.

తెలుగుదేశంపార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఆయనింతసమ్మోహనం పెంచుకోడానికి కారణం ఏమిటి?ప్రియమిత్రుడు నిర్మాత అశ్వనీదత్‌ టిడిపితరఫున పోటీ చేయడం వల్లనే చిరంజీవిఆ పార్టీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా మారుతున్నారన్నఅభిప్రాయం ఉంది. కానీ అశ్వనీదత్‌ కు టిడిపిటికెట్‌ వచ్చేలా చేసింది చిరంజీవేనని చంద్రబాబునాయుడికి చిరుకీ మధ్యవర్తిత్వం చేసినఒక మాజీ ఎంపీ చెబుతున్నారు. చిరంజీవికి చంద్రబాబునాయుడు పరిపాలన బాగా నచ్చినదంట. ఆయనమరికొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగితేరాష్ట్రం బాగుపడుతుందని చిరంజీవిసిన్సియర్‌ గా నమ్ముతున్నారు.

చిరంజీవిఅధికారికంగా టీడీపీలో లేకున్నా, ఆ పార్టీకీమొత్తంగా ఆయన ప్రచారంచేయకున్నా, ఆ పార్టీకి అనుకూలుడుగాఇప్పటికే ముద్రపడిపోయింది.

నేను పార్టీలో ఉంటే చిరంజీవి ఉన్నట్లేననివిజయవాడ టీడీపీ లోక్‌సభ సీటు పొందిననిర్మాత అశ్వనీదత్‌ మంగళవారం ఓన్యూస్‌ ఛానెల్‌కు చెప్పారు.అశ్వనీదత్‌తో పాటు, కంకిపాడు టీడీపీఅభ్యర్థి గద్దే తరఫున చిరంజీవిఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రచారంచేస్తారు. అంటే వీరివురిని గెలిపించమనిచిరంజీవి చెప్పే చిన్న చిన్న చిత్రాలనురూపొందించి వాటిని ఆయా నియోజకవర్గాల్లోప్రదర్శిస్తారని టీడీపీ వర్గాలుచెప్పుతున్నాయి. వీటిని మొత్తం అన్నినియోజకవర్గాల్లోనూ ప్రదర్శించేఅవకాశం లేకపోలేదని అంటున్నారు.

చిరంజీవిటిడిపి వైపు మొగ్గడం వల్ల ఆ పార్టీకిఎంత మేలు జరుగుతుందని రాజకీయపండితులు అప్పుడే లెక్కలు వేయడం ప్రారంభించారు.మరోవైపు చిరంజీవి నిర్ణయం ఆయన అభిమానుల్లోనిఒక వర్గానికి రుచించలేదన్న వార్తలువస్తున్నాయి. అయినా చిరంజీవి ప్రభావంసామాన్య ఓటర్లపై బాగా ఉంటుందని భావిస్తున్నారు.అన్నీ బాగున్న పార్టీల మీదే సినిమానటుల ప్రభావంపనిచేస్తుంది గానీ ఎదురీదే పార్టీలకు పనికిరాదన్నఅభిప్రాయం ఉంది.

అల్లుఅరవింద్‌ కు రాజ్యసభ టికెట్‌, అశ్వనీదత్‌కు లోక్‌ సభ టికెట్‌ చిరంజీవి రహస్య ఎజెండాలోభాగమని తెలియవచ్చింది. ప్యాకేజి డీల్‌ కాబట్టిటిడిపి డిమాండుకు తగినట్టు చిరంజీవివ్యవహరించవలసి ఉంటుంది.

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X