వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్దుబాటుడైలమా!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Saturday, September 11 2004

;?

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలోకాంగ్రెస్‌ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తే సోనియాగాంధీని, వైఎస్‌రాజశేఖరరెడ్డిని రోడ్డుకు ఈడుస్తానని టిఆర్‌ఎస్‌ అధినేతచంద్రశేఖరరావు చేసిన ప్రకటన కాంగ్రెస్‌ వర్గాల్లోఆగ్రహం కలిగించింది. దీనిమీద అధిష్టానవర్గానికి ఫిర్యాదు చేస్తామని,అవసరమైతే టిఆర్‌ఎస్‌తో పొత్తును వదులుకుంటామని పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ శనివారం ఉదయం ప్రతిస్పదించారు. పరిస్ధితి ఇలాగేకొనసాగితే కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ల హనీమూన్‌ ముగిసిపోయేఅవకాశాలు కన్పిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనితనకు సోనియాగాంధీ స్వయంగా నాలుగైదు సార్లు హామీ ఇచ్చారనిఆమె మాట తప్పితే ఆమెను బజారుకు ఈడుస్తాననిచంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు పత్రంతో పాటు ఆవీడియో టేపులను ఢిల్లీకి పంపే పనిలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులునిమగ్నమై ఉన్నారు. దీనిపై ఎఐసిసి ప్రత్యేక సమావేశం జరిగేఅవకాశముందని భావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌తో తెగతెంపులుచేసుకుంటే వచ్చే లాభనష్టాలను కాంగ్రెస్‌ అధిష్టానవర్గం బేరీజువేసుకుంటుంది.

రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్నిసత్వరం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తే ఆక్రెడిట్‌ను కెసిఆర్‌కు పోకుండా చూడాలన్నది తెలంగాణ కాంగ్రెస్‌నాయకుల మనోగతం. అటువంటి పరిస్ధితుల్లో టిఆర్‌ఎస్‌తోతెగతెంపులు చేసుకోకుండానే సోనియాగాంధీని తెలంగాణ పర్యటనకురప్పించి కాంగ్రెస్‌ పార్టీ తనంతట తాను ప్రత్యేక తెలంగాణకుఅంగీకరిచిందే కానీ చంద్రశేఖరరావు వత్తిడి వల్ల కాదనిప్రకటన ఇప్పించాలన్నది వీరి వ్యూహం. అప్పుడు తెలంగాణ లో టిఆర్‌ఎస్‌క్షీణించిపోయి కాంగ్రెస్‌ కంచుకోటగా మారుతుందనికేశవరావు తదితర కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రెండోఎస్సార్సీతో సంబంధం లేకుండా తెలంగాణ ఏర్పాటుకు ఆర్డినెన్స్‌ జారీచేయకపోతే రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండమని టిఆర్‌ఎస్‌మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చంద్రశేఖరరావు పిలుపుఇచ్చారు. పదవులు వదులుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలేవదీయాలని ఆయన అనుకుంటున్నారు. తెలంగాణ వాదుల్లో కొన్నివర్గాలకు కెసిఆర్‌ మీద నమ్మకం లేకపోవడంతో ఉద్యమం ఎంతవరకు సఫలీకృతం అవుతుందన్నది సందేహంగా ఉంది.

సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X