వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామూలైపోయిన మామూళ్ళు!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Friday, December 24 2004

హైదరాబాద్‌:అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలోఅయినా ఇప్పుడు వైఎస్‌ జమానాలో అయినా ప్రాముఖ్యంలేని అంశం అవినీతి నిర్మూలన.టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రెండూ అవినీతిని, లంచగొండి తనాన్నిచాలాసాధారణమైన విషయంగా తీసుకుంటున్నాయి. ఆ మధ్య ఒక ఎమ్మెల్యేసచివాలయంలో ఒక ఫైలు విషయం అడగడానికిఒక శాఖలోని పెద్ద గుమాస్తా వద్దకువెళ్ళాడు. ఓ ఐదు వందలు ఇచ్చుకోండి.ఫైలు కదిలేలా చూస్తా అని గుమాస్తా అన్నాడట.ఏం బాబూ, నేను ఎమ్మెల్యేనని చెప్పాకదా. నన్ను కూడా లంచం అడుగుతావా? అనిఎమ్మేల్యే కోప్పడ్డారు. నువ్వుఎమ్మెల్యేవి కాబట్టే ఐదొందలు. మామూలువాళ్ళకయితే వెయ్యి రూపాయలుఅన్నాడట ఆ పెద్ద గుమాస్తా.బిత్తరపోయిన ఆ ఎమ్మెల్యే కొందరుజర్నలిస్టులకు తనకెదురైనఅనుభవాన్ని ఇష్టాగోష్టిగా చెప్పారు.

లంచగొండితనం ఇంత మామూలు విషయమై పోవడం ఎంతదారుణం. నెలకు పదివేలజీతం కూడా రాని కొన్ని శాఖల దిగువ స్ధాయిఅధికారులు కోటీశ్వరులు అవుతున్న దాఖలాలు కళ్ళముందు కన్పిస్తున్నాయి.జూబిలీహిల్స్‌ ప్లాట్ల రిజ్రిస్టేషన్‌ చేసే సబ్‌రిజ్రిస్టారు ఆ సర్కిల్‌ లో ఉండడానికి ఏటా లక్షలాదిరూపాయలు ఉన్నతాధికారులకు సమర్పించుకోవాలంట.అవినీతి మీద ఒక ఉద్యమంగా విరుచుకుపడాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో కొరవడింది. ఒక నెలరోజులపాటు రోజుకి కొన్ని వందల ప్రభుత్వఉద్యోగుల మీద కేసులు నమోదు చేస్తేకొంత మార్పు కన్పించవచ్చు. అయినామూడు లక్షల లంచం తీసుకుని చర్లపల్లిజైలులో మూడేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న మెజ్రిస్టేట్లు ఈపుణ్యభూమిలోఉండగా ఇతర శాఖల గురించి మాట్లాడుకోవడందండుగ.

మల్టీనేషనల్‌ కంపెనీలు మన దేశంలోసెంటర్ల పెట్టడానికి వెనకా ముందూకావడానికి ఉన్న కారణాల్లో ఈలంచగొండితనం ఒకటి. తమ ఆస్తులరిజ్రిస్టేషన్‌ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఎన్నారైలకుకూడా ఈ లంచగొండితనం ఆశ్చర్యానికి అసహనానికి గురి చేస్తున్నాయి. ఇ-సేవ కేంద్రాలు వచ్చినతర్వాత లేబర్‌, కమర్షియల్‌ టాక్స్‌,మునిసిపల్‌ శాఖల్లో దిగువ స్ధాయిలో అవినీతితగ్గిన మాట వాస్తవం. నిబంధనలనుఇంకా సరళతరం చేస్తే అవినీతిమరింత తగ్గుతుంది. దీనికి తోడు దండోపాయంకూడా ఉండాలి.

  • తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
  • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
  • తారల ప్రభావం నిల్‌!
  • ఉద్వేగ అంశాలు
  • తారల ప్రభావం నిల్‌!
  • ఇప్పటికిప్పుడు చెరిసగం

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X