వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీజీ చివరి అడుగులు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, September 03 2004

మహాత్మాగాంధీ హత్యకేసులో ఏడోనిందితుడిగా ఉన్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడువీర్‌సావర్కర్‌ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. సావర్కర్‌పైకాంగ్రెస్‌ నాయకుడు,కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ నేపధ్యంలోమహాత్ముడి జీవితంలో చివరి ఘట్టాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

మహాత్ముడి ఆఖరి అడుగులు
(2-9-1948)

మహాత్మాగాంధీ వేసిన చివరి అడుగులు అవి. అటూ ఇటూఆయన మనవరాళ్ళు ఆవ,మను. దేవుడిని ప్రార్ధించడానికిఆయన ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు.డెబ్బై ఎనిమిదేళ్ళ వయసు కాబట్టి ఆయన అడుగులుతడబడుతున్నాయి. నీలం రంగు చొక్కా మీద ఖాకీ జాకెట్‌ వేసుకున్న ఒకబలిష్టమైన యువకుడు అకస్మాత్తుగా ఎదురై గాంధీకాళ్ళ మీద పడ్డాడు.

అతను హిందూ రాష్ట్ర అనే తీవ్రవాద దినపత్రికఎడిటర్‌ నాదూరామ్‌ వినాయక్‌ గాడ్సే. ముస్లింలను గాంధీవెనకేసుకు వస్తున్నారని ఆ పత్రిక ఘాటుగా విమర్శిస్తూ వస్తోంది.గాంధీ కాళ్ళ మీద పడిన గాడ్సే తలపైకెత్తి ఈ రోజుప్రార్ధనకు ఆలస్యంగా వచ్చినట్టుంది అన్నాడు. అవును అనిగాంధీజీ సమాధానమిచ్చారు.

క్షణాల్లో జేబులో నుంచి చిన్న పిస్టల్‌ తీసిన గాడ్సే మూడుసార్లు గాంధీజీ మీద కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్‌ ఛాతీలోకి,రెండు కడుపులోకి దూసుకెళ్ళాయి. ఆ సమయంలో గాంధీజీమరణాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా చేతులు పైకి జోడించారు. కొన్నిక్షణాల పాటే ఉన్న ఆ భంగిమ హిందువుల అభివాదం లాగా, క్రిస్టియన్లప్రార్ధన లాగా కనిపించింది.

కుప్పకూలిన గాంధీజీ "హేరామ్‌హేరామ్‌ అని చిన్నగా స్మరించుకున్నారు. నెత్తురోడుతున్నగాంధీని ఇద్దరు మనవరాళ్ళు బిర్లా హౌస్‌కు తీసుకెళ్ళారు.గాంధీ మళ్ళీ మాట్లాడలేదు. ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లోకలిసిపోతుండగా ఆయనకు ఇష్టమైన భగవద్గీతశ్లోకాలను మనవరాళ్ళు చదివారు.

Recent Stories
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X